కేసీఆర్ పాస్‌పోర్ట్ రెన్యూవల్! అమెరికానా? సింగపూర్ టూరా?
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. తన పాస్‌పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. ఆ తర్వాత పాస్‌పోర్టు కార్యాలయం నుంచి కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు. దాదాపు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్ తెలంగాణ భనవ్‌కు వెళ్లడం గమనార్హం. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల వేళ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశారు.
అయితే, కేసీఆర్ తాజాగా తన పాస్‌పోర్ట్ రెన్యూవల్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అమెరికా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. తన మనవరాలు అలేఖ్యకు అమెరికాలో సీటు రావడంతో ఆయన అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సాచారం. అందుకే ఆయన తన పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసకున్నారని, డిప్లమాట్ పాస్‌పోర్టును సాధారణ స్థితికి మార్చుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, కేసీఆర్ సింగపూర్ వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో చదువుకున్న కేటీఆర్ కుమారుడు హిమాన్షు ప్రస్తుతం సింగపూర్‌లో విద్యాభ్యాసం చేస్తున్నారు. తాతా మీద బెంతో పదే పదే స్వదేశానికి తిరిగి వస్తుండటంతో అమెరికా నుంచి సింగపూర్ కు హిమాన్షును షిప్టు చేయించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే మనవడు హిమాన్షుతో కొంత కాలం గడిపేందుకు సింగపూర్‌కు కేసీఆర్ వెళ్తున్నారని కూడ ప్రచారం జరుగుతోంది. విదేశీ ప్రయాణం పక్కా ఉన్నందునే కేసీఆర్ తన పాస్ పోర్ట్ ను రెన్యూవల్ చేసుకున్నారని తెలుస్తోంది. కాగా, కేసీఆర్ తోపాటు ఆయన సతీమణి శోభ కూడా పాస్ పోర్ట్ కార్యాలయానికి రావడం గమనార్హం.
passport బ్రోకర్ చంద్రశేఖర్ ని దుబాయ్ శేఖర్ ని
— Shashi Kumar Reddy Vura (@vurashashi) February 19, 2025
పాస్ పోర్ట్ కోసం passport ఆఫీస్ కి రప్పించిన ఘనత ఎవరిది అంటారు ?? #JustAsking
కొంపదీసి #RevanthReddy గారు అన్నట్టు #America పారిపోవట్లే గా 🤔#Telangana #BRSParty #KCR #Revanthreddy pic.twitter.com/wMT7vF3AmF
ఇది ఇలావుంటే, కేసీఆర్ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లి రెన్యూవల్ చేసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి స్పదించారు. కేసీఆర్ అమెరికా వెళ్తారని.. అక్కడ ప్రభాకర్ రావును కలుసుకుంటారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏది ఏమైనా కేసీఆర్ విదేశీయానంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications