రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు జరుగుతుందిదే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడం కోసం కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. నేడు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటయ్యారని వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ టైం ఇవ్వటం లేదు: ఎర్రబెల్లి
ఇది సర్కార్ కూలిపోవడానికి తొలి సంకేతం అని మాజీ మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం లేదని, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కూడా టైం ఇచ్చే పరిస్థితి లేదని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన గురించి తెలిసే రాహుల్ గాంధీ వరంగల్ టూరు రద్దయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేశారు.

Former Minister Errabelli Dayakar rao sensational comments on CM revanth reddy

ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేసే పరిస్థితి
ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి వచ్చిందని ఎర్రబెల్లి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దాల మయమని, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని ఎర్రబెల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ ను ఓడించి తప్పు చేశాము అన్న భావనలో ఉన్నారన్నారు.

ఎన్నికలొస్తే గెలిచేది బీఆర్ఎస్ నే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ 100సీట్లు గెలుస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అబద్దాలతోనే కాలం వెళ్ళదీస్తుందని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని కేసులు పెట్టిన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఒక్కరూపాయి ఖర్చు చేయటం లేదు
రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఎర్రబెల్లి తెలిపారు. అంతేకాదు అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని చెప్పిన హామీల మాట ఏమిటని ఎర్రబెల్లి ప్రశ్నించారు. గత 14 నెలల కాలంలో అభివృద్ధి కోసం ఒక రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది లేదని ఎర్రబెల్లి ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు బిఆర్ఎస్ దేనిని బల్లగుద్ది మరీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+