సస్పెన్షన్ వేటుపై మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ స్పందన; కేసీఆర్ కు సవాల్!!
బీఆర్ఎస్ పార్టీ నుండి తనను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. టిఆర్ఎస్సో.. బీఆర్ఎస్సో ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తనను సస్పెండ్ చేయడంతో తనకు స్వేచ్ఛ లభించిందని పంజరం నుండి బయటకు వచ్చిన చిలకలా అనిపించిందని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇన్నాళ్లు తాను పార్టీలో ఉన్నట్టా లేనట్టా చెప్పాలని ప్రశ్నించారు.
తాను ఎన్నడు పార్టీలో ఉన్నానని చెప్పలేదని అయితే ఇప్పుడు తనను సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు తాను పార్టీలోనే ఉన్నట్టు తెలిసిందని జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో కేసీఆర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన జూపల్లి కృష్ణారావు తనని ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు. తాను అడిగిన ప్రశ్నలలో అబద్ధాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. తను చేసిన వ్యాఖ్యలు నిజమని నిరూపించే సత్తా తనకు ఉందని నిజా నిజాలు నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు.

కెసిఆర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తనను సస్పెండ్ చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తన సస్పెన్షన్ పై వంద మాగదులతో మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడిస్తున్నారని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారు అన్న జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్త అని, యావత్ ప్రజానీకానికి జవాబుదారీ అంటూ పేర్కొన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి పారదర్శకంగా పాలన సాగించాల్సిన వ్యక్తి అంటూ వ్యాఖ్యలు చేశారు.
కానీ కెసిఆర్ రాష్ట్రమే తనది అన్నట్టు, ఖజానా తనది అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానని, నచ్చినట్టు దానధర్మాలు చేస్తానని, అసలు మీరెవరు అడగడానికి అన్నట్టు కెసిఆర్ ప్రవర్తిస్తున్నారని జూపల్లి కృష్ణారావు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సహకారం కేసీఆర్ వల్లనే కాలేదని, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పూనుకుంటే, వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన వెల్లడించారు. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాల్సింది పోయి పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి అన్నారు.












Click it and Unblock the Notifications