వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం సమాంతర ప్రభుత్వం, మాజీ మంత్రి హెల్ప్ వెనుక..?, 2 సంచుల్లో బంగారం!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం నల్గొండ జిల్లాలోని భువనగిరిలో ఓ విధంగా సమాంతర ప్రభుత్వం నడిపాడా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లో అతను తన అనుచరులను బరిలోకి దింపి, గెలిపించుకునే వాడని తెలుస్తోంది.

ఎవరైనా అడ్డు వస్తే వారిని తొలగించుకోవడానికి కూడా వెనుకాడేవాడు కాదంటున్నారు. భువనగిరి, యాదగిరి గుట్టలలో నయీంకు పెద్ద నెట్ వర్క్ ఉంది. ఈ ప్రాంతాల్లో నయీం కనుసన్నుల్లోనే 40 శాతం భూమి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఓ విధంగా ఇతను సమాంతర ప్రభుత్వాన్ని నడిపినట్లుగా చెబుతున్నారు.

 Former minister links with Nayeem?

నయీం అత్త ఆస్తులు రూ.1400 కోట్లు

నయీం అక్రమాస్తుల చిట్టా బాగానే వెలుగు చూస్తోంది. అదేవిధంగా అతని అత్త ఆస్తులు కూడా భారీగానే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నయీం అత్త ఆస్తులు రూ .1400 కోట్లుగా ఉన్నట్లుగా గుర్తించారు. నయీం, నయీం అనుచరులు, బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

'నయీం ఆస్తులు మాకే చెందాలి': ఐటీ నజర్, జఫ్తు ఛాన్స్'నయీం ఆస్తులు మాకే చెందాలి': ఐటీ నజర్, జఫ్తు ఛాన్స్

నయీంకు ఆ మాజీ మంత్రి సహకారం వెనుక..!

నయీం ఆగడాల వెనక నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతనిని ఏ1గా చేర్చి, విచారించనున్నారని అంటున్నారు. నయీంకు అండదండలకు ఓ కారణమున్నట్లుగా తెలుస్తోంది.

సదరు మాజీ మంత్రి కుటుంబ సభ్యుడిని నక్సలైట్లు హతమార్చారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యుడిని హతమార్చిన నక్సలైట్లు, వారి సానుభూతిపరుల పైన ఆగ్రహం పెంచుకున్న సదరు మాజీ మంత్రి వారిపై కక్ష తీర్చుకునేందుకు నయీంను ఉపయోగించుకున్నట్లుగా పోలీసులకు ఆధారాలు లభించాయని తెలుస్తోంది.

నయీం కలలు: ప్రచారం కోసం పక్కా వ్యూహం, టీవీ ఛానల్ఈ క్రమంలో నయీం మాజీ మంత్రి నీడలో ఎదిగారని అంటున్నారు. సదరు మాజీ మంత్రి ఇంట్లోనే చాలా కాలం ఉన్నాడని తేలిందని తెలుస్తోంది. పోలీసుల విచారణలో సదరు మాజీ మంత్రి అతని ఫోన్‌ నంబర్లు తనిఖీ చేయగా అందులో మాజీ మంత్రివే ఎక్కువ కాల్స్‌ ఉన్నట్లుగా గుర్తించారు. సెల్‌ఫోన్‌తో పాటు ఇంటి ల్యాండ్‌లైన్‌ నెంబర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

రెండు సంచుల్లో బంగారం!

హైదరాబాదులోని నయీం ఇంట్లో పోలీసులు భారీ ఆస్తులు గుర్తించారు. వజ్రాలు పొదిగిన బంగారు వాచీలు, బంగారు చైన్లు, బ్రేస్‌లెట్లు, నెక్లెస్‌లు.. ఇలా ఎన్నో గుర్తించారని తెలుస్తోంది. ఏకంగా రెండు గోనె సంచుల్లో బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలుస్తోంది. వీటి బరువు 50 కేజీలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

English summary
Former minister links with Gangster Nayeem?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X