ఎప్పుడొచ్చామన్నది కాదన్నా.. శ్రీనన్న బుల్లెట్ కచ్చితంగా దిగుతుంది!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై, ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరి బతుకులు బాగుపడతాయని భావించామని ఎన్నో కలలు కన్నామని, కానీ ఆ కలలు నెరవేరలేదని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం గా గద్దెనెక్కిన కేసీఆర్ రెండుసార్లు ప్రజలను మాటల గారడీతో మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారని, మూడవసారి సీఎం అవ్వడానికి ప్లాన్లు చేస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
తన విజయం అక్కడ నుండే అంటున్న పొంగులేటి : మరో ఐదు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయని, కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను గద్దె దించాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తన విజయం అశ్వరావుపేట నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, 30 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదని, ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మా తాతలు నేతులు తాగారని చెప్పడం కాదు ఏం మంచి చేశారో చెప్పాలంటూ నిలదీశారు. ఎప్పుడు వచ్చామన్నది కాదు ఎన్ని మంచి పనులు చేశామన్నదే ముఖ్యం అంటూ విరుచుకుపడ్డారు.

పోకిరీ సినిమా డైలాగ్ చెప్పిన పొంగులేటి : ఇక ఇదే సమయంలో పోకిరి సినిమా డైలాగును గుర్తుచేసి, తనదైన శైలిలో చెప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు వచ్చామన్నది కాదు.. శ్రీనన్న బుల్లెట్ తప్పకుండా దిగుతుంది అంటూ హెచ్చరించారు. ఇక ఆ బుల్లెట్ కచ్చితంగా గుచ్చుకుంటుందని, గుర్తుంచుకోవాలంటూ పేర్కొన్నారు. శ్రీనన్న నిర్ణయం బుల్లెట్ లాగా ఉంటుందని, బిఆర్ఎస్ నేతలు దానికి సిద్ధంగా ఉండాలంటూ సవాల్ విసిరారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకతను ఎదుర్కొని, బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిఆర్ఎస్ పార్టీపై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

బిఆర్ఎస్ కు బుల్లెట్ దించటం ఖాయమన్న పొంగులేటి : ఇప్పటివరకు ఏ పార్టీలోనూ చేరకుండా, సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని చెబుతున్న పొంగులేటి వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడం పక్కా అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిజెపిలో చేరుతారని, వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఆయన తాను ఏ పార్టీలో చేరబోతున్నారు అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే వచ్చే ఐదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని పేర్కొన్న ఆయన బిఆర్ఎస్ కు బుల్లెట్ దించటం ఖాయమని చేసిన వ్యాఖ్యలతో మరోమారు అందరి దృష్టిని ఆకర్షించారు.












Click it and Unblock the Notifications