అసెంబ్లీ ఎన్నికల వేళ- బండి సంజయ్‌కి అమిత్ షా హామీ

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తన దూకుడు పెంచారు.

ఎన్నికలకు సమాయాత్తం కావాల్సిన పరిస్థితుల్లో మొన్నటివరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అంతర్గత కుమ్ములాటలను ఎదుర్కొంది. పార్టీ నాయకత్వంపై చెలరేగిన అసంతృప్తితో సతమతమైంది. ఇప్పుడా పరిస్థితి లేదు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించింది పార్టీ అధిష్ఠానం. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డికి పగ్గాలను అప్పగించింది.

bandisanjaiamitshah1

ఈ పరిస్థితుల్లో బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ కోటా కింద బండి సంజయ్‌ను తీసుకోవచ్చంటూ జోరుగా ప్రచారం సాగింది. తదుపరి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ పరిణామాల మధ్య- బండి సంజయ్ ఇవ్వాళ దేశ రాజధానిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయనతో పలు అంశాలపై చర్చించారు. కరీంనగర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆయన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చారు.

bandisanjaiamitshah2

ఈ మధ్యాహ్నం అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు బండి సంజయ్. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడానికి అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. పార్టీ క్యాడర్ మొత్తం ఎన్నికలను ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉందని చెప్పారు.

దీనికి అమిత్ షా స్పందించారు. త్వరలో తాను తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. రాష్ట్రస్థాయిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఆయన బండి సంజయ్‌కు సూచించారు. పార్టీ రాష్ట్రశాఖ కొత్త అధ్యక్షుడు, నూతన కార్యవర్గంతో సమన్వయం చేసుకోవాలని, పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+