అదే జాబితాలో అక్కినేని నాగార్జున కూడా- కేటీఆర్‌కు థ్యాంక్స్..!!
దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది
హైదరాబాద్: దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం వినియోగిస్తారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి.

సమీపిస్తోన్న గడువు..
ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఈ రేసింగులు నడుస్తున్నాయి. వాటి సరసన హైదరాబాద్‌కు కూడా చేరింది. దీనితో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించినట్టయింది. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఈ కార్ రేసింగ్ ఉంటుంది. దీనికి అవసరమైన పనులు త్వరలోనే మొదలు కానున్నాయి.

ఇదివరకే ఒప్పందాలు..
తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఎఫ్ఐఏ ఫార్ములా ఈ చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ ఆల్బెర్టో లొంగో, రేసింగ్ ట్రాక్ అండ్ ఓవర్‌లాగ్ డైరెక్టర్ ఆగస్ జొమెనో, గ్రీన్‌కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫసీర్ అనిల్ చలమలశెట్టి, మహీంద్రా రేసింగ్ సీఈఓ అండ్ టీమ్ ప్రిన్సిపల్ దిల్‌బాగ్ గిల్ మధ్య గత ఏడాదే ఒప్పందాలు కుదిరాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించబోతున్నామంటూ అప్పట్లో వారు ప్రకటించారు.

22 కార్లతో రేసింగ్..
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ గడువు సమీపిస్తోండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. మొత్తం 22 కార్లు ఇందులో పాల్గొంటాయి. 11 టీమ్‌లు రేసింగ్ కోసం హైదరాబాద్ కు రానున్నాయి. రేసింగ్ ట్రాక్ పొడవు సుమారు 2.8 కిలోమీటర్లు. ఆన్ లైన్‌లో ద్వారా బుక్ చేసుకోవడానికి మొత్తం 22,500 టికెట్లను టోర్నమెంట్ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

మహేష్ బాబుతో మొదలు..
ఈ రేసింగ్ తో ప్రపంచ క్రీడా పటంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం దక్కబోతోందని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. ఫార్ములా-ఈ కార్ రేసులు ఎప్పుడెప్పుడు మొదలవుతాయని ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నానని చెప్పారు. వాతావరణం మార్పులో భాగంగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించిన ఈ ఫార్ములా-ఈ కార్ రేస్ గ్రాండ్ సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇక నాగార్జున వంతు..
ఇప్పుడు తాజాగా అక్కినేని నాగార్జున కూడా అదే జాబితాలో చేరారు. కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. బ్యూటిఫుల్ హుస్సేన్ సాగర్ లేక్ వద్ద చరిత్ర సృష్టిద్దాం అంటూ పిలుపునిచ్చారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నమెంట్ ను నిర్వహించడానికి చొరవ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, హెచ్ఎండీఏ అధికారులు, గ్రీన్ కో చీఫ్ అనిల్ చలమలశెట్టికి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ మేరకు 40 సెకెన్ల నిడివి ఉన్న ఓ వీడియోను నాగార్జున తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
-
సీఎం రేవంత్‌కు దమ్ముంటే - కేటీఆర్ సంచలన డిమాండ్..!! -
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి?












Click it and Unblock the Notifications