దారుణం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై గ్యాంగ్ రేప్

మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఊర్లోకి వచ్చి గ్రామస్థులను విచారించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రైతు దుర్మరణం

పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ తిరగబడటంతో రైతు మరణించాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం బాలానగర్‌ మండలం ఉడిత్యాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మాల చెన్నయ్య (40) బుధవారం రాత్రి వర్షం కురిసి అదును రావడంతో గురువారం సాయంత్రం గ్రామ శివారులోని తన సొంత పొలంలో ట్రాక్టర్‌తో దున్నకం ప్రారంభించారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ తిరగబడడంతో చెన్నయ్య ట్రాక్టర్‌ కిందపడి మరణించాడు. మృతుడు చెన్నయ్యకు భార్య యాదమ్మ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Four arrested in a gang rape case in Mahaboobnagar district

రోడ్డు ప్రమాదం ప్రమాదంలో మృతి

ఎదురెదురుగా లారీ, చిన్నలారీ అతివేగంగా వస్తూ ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ మరణించారు. వీరిలో ఇద్దరు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారు. మరొకరిది జార్ఖండ్‌ రాష్ట్రం. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

కూల్ డ్రింక్ సీసాల లోడుతో చిన్నలారీ గడి మైసమ్మ ప్రాంతం నుంచి గురువారం తెల్లవారుజామున 2 గంటలకు మేడ్చల్‌ వైపు వెళ్తోంది. ఆ సమయంలో మేడ్చల్‌ మండలం గిర్మాపూర్‌ సమీపంలోని కంకర మిషన్‌కు సంబంధించిన లారీ వేగంగా ఎదురుగా వచ్చింది. బాసరేగడి గ్రామ సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రెండు వాహనాల డ్రైవర్లలో మహబూబ్‌నగర్‌కు చెందిన మాముళ్ల రాజు (26), జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన రితూలాల్‌ మహతో (29) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నలారీలో క్లీనర్‌గా పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన పెద్ద మహబూబా (26)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా అతను మార్గమధ్యలో చనిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+