ఘోర ప్రమాదం: చిన్నారులతోపాటు కుటుంబం దుర్మరణం

పెద్దపల్లి: జిల్లాలోని కాట్నపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మంథనిలోని కృష్ణవేణి పాఠశాల యజమాని అరుణ్ కుమార్.. భార్య సౌమ్యతో పాటు ఇద్దరు చిన్నారులు అఖిలేశ్‌, సౌమ్యలతో కలిసి హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

 Four of family killed as car collides with stationary lorry

హైదరాబాద్‌లో అరుణ్‌కుమార్‌ తమ్ముడు సాయికుమార్, బావమరిది ఓంప్రకాశ్‌లను పాలిటెక్నిక్‌ కళాశాలలో అడ్మిషన్ కల్పించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని గమనించక ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. గురువారం రాత్రి రెండు గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. నలుగురి మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో విషాద వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+