నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు అక్కడికక్కడే మృతి..
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో.. అందులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.
డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలానికి చెందిన రాఘవేందర్(36), దీప్తి(34) దంపతులు తమ తేజస్ (10), సిగ్న(4)గా గుర్తించారు. వీరంతా కారులో హైదరాబాద్ నుంచి కోటగిరి వెళ్తున్నారు.

అదే సమయంలో నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో రాఘవేందర్, దీప్తిలతో పాటు ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications