వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యం చిగురిస్తూ ఉండేదే స్నేహం.!కేరింతలతో స్నేహితుల రోజును జరుపుకుంటున్న యువత.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అరమరికలు లేనిది.. అపురూపమైనది.. అద్బుతమైనది.. అమూల్యమైనది.. అమోఘమైనది..అన్యోన్యమైనది..అద్వితీయమైనది.. ఆఖరిక్షణం వరకు నిలిచేది స్నేహం ఒక్కటే.!స్నేహానికి ఉన్న విలువను వెలకట్టడం ఎవ్వరికి సాద్యం కాదు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి స్నేహం అనే చిన్న పదంతో దగ్గరై తుదివరకూ కలిసి ప్రయాణం చేసేదే స్వఛమైన స్నహం. ఇలాంటి పవిత్రమైన స్నేహానికి పరమార్థంగా ఎంతో మంది సజీవ సాక్షాలుగా నిలుస్తారు. రక్తబంధం కన్నా స్నేహ బంధం గొప్పది అని చాటిచెప్పుకునే స్నేహితుల దినోత్సవాన్ని యువత కేరింతల మధ్య జరుగపుకుంటున్నట్టు తెలుస్తోంది.

 స్నేహితుల దినోత్సవం..

స్నేహితుల దినోత్సవం..

స్నేహానికి లేవు హద్దులు..స్నేహానికి లేవు ఎల్లలు..స్నేహానికి ప్రాంతీయ భావం కానీ, భాషా భేదం కానీ, కులం, మతం, వర్ణం, గోత్రం ఇలంటి తారతమ్యాలు అస్సలు రుచించవు. మొదటి పరిచయంలో సానుకూల దృక్పదం ఏర్పడితే క్రమంగా పెరిగి పెద్దదై మర్రిచెట్టు ఊడల్లా బలంగా పాతుకుపోతుంది స్నేహం. ప్రాణంగా చూసుకునే స్నేహితుడు అర్ధాంతరంగా దూరమైతే తట్టులేక తనువు చాలించిన అరుదైన సంఘటనలు కూడా చరిత్రలో ఎన్నో ఉన్నాయి. రక్త బంధం కన్నా స్నేహ బంధం గొప్పదని చాటిన కల్మషం లేని స్నేహితులను కూడా మనం చూస్తుంటాం.

అరమరికలు లేనిది స్నేహం..

అరమరికలు లేనిది స్నేహం..

ప్రతి సంవత్సరం మొదటి ఆదివారాన్ని స్నేహితుల రోజుగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఎక్కడెక్కడో ఉన్న స్నేహితులకు ఫోన్ చేసి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవడం, గత మధుర స్మృతులను నెమరువేసుకోవడం సహజంగా జరిగిపోయే ప్రక్రియ. మరికొన్ని చోట్ల అందుబాటులో ఉన్న స్నేహితులందరూ కలుసుకుని తనివితీరా వారి అనుభవాలను నెమరువేసుకోవడం, సరదాగా కాలక్షేపం చేయడం, చిన్న పాటి పార్టీలు నిర్వహించుకోవడం సర్వసాధారణంగా జరిగిపోతుంటుంది. ఇలాంటి సందర్బాలు స్నేహం గొప్పతనాన్ని చాటుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

 స్నేహంలోని మాధుర్యం నిత్యం పరిమళిస్తూనే ఉంటుంది..

స్నేహంలోని మాధుర్యం నిత్యం పరిమళిస్తూనే ఉంటుంది..

స్నేహం ఎంత పవిత్రంగా ముందుకు వెళ్తుందో ఒక్కోసారి ఇదే స్నేహాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుంటూ స్నేహం విలువను కాలరాసే కొంత మంది దిగజారిన వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే అందరితో స్నేహం అచ్చిరాదని ఇంట్లోని పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు కూడా. చెడు స్నేహం చేసి మోసపోయిన సంఘటనలు అనేకం వెలుగుచూసినప్పటికి, స్వచ్చమైన స్నేహానికి ఉన్న మాధుర్యం మాత్రం నిత్యం పరిమళిస్తూనే ఉంటుంది. స్నేహానికి బంధాలు బందుత్వాలు సరితూగవని చెప్పే గొప్ప గొప్ప సంఘటనలు, గొప్ప గొప్ప స్నేహితులు కూడా మన మధ్యనే ఉండడం గర్వంగా అనిపిస్తుంటుంది.

రక్తబంధం కన్నా స్నేహ బంధం గొప్పది..

రక్తబంధం కన్నా స్నేహ బంధం గొప్పది..

ఇక స్నేహం గొప్పతనాన్ని అభివర్ణిస్తూ అనేక సినిమాలు, అనేక పాటలు కూడా సమాజం ముందుకు వచ్చాయి. స్నేహానికి ఉన్న పవిత్రతను ఈ పాటలు, సినిమాలు చాటిచెప్పాయి. ఏళ్లు గడుస్తున్నప్పటికి ఈ సినిమాల, పాటల ఇతివృత్తం స్నేహితుల మనసుని సున్నితంగా తడుతూనే ఉంటాయి. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఉన్న స్నేహితులకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు చెప్పుకోవడం స్నేహంలోని పవిత్రతను చాటుతుంది. స్నేహితుల రోజును పురస్కరించుకుని పది సంవత్సరాల పిల్లల నుండి 80సంవత్సారా వృద్దుల వరకూ అందరూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ కాసేపు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోవడం సహజంగా జరిగిపోతుంది. అదే స్నేహితుల రోజుకు ఉన్న గొప్పతనం.!

English summary
It seems that Friendship Day is being celebrated among the youth with utmost of movements, who claim that friendship is greater than blood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X