ఢిల్లీలో సీఎం కేసీఆర్ మిత్రులేమయ్యారు - ఆ నేతల దూరానికి కారణం..!?

ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయిదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీ లక్ష్యంగా చేసుకుంటూ ఏర్పాటైన బీఆర్ఎస్ కు ఇతర పార్టీల మద్దతు పైన ఇప్పుడు చర్చ మొదలైంది. బీజేపీ -కాంగ్రెసేతర పార్టీల మద్దతు బీఆర్ఎస్ కు ఖాయమని అంచనా వేసారు. పార్టీ ఏర్పాటు కసరత్తులో భాగంగా సీఎం కేసీఆర్ పలు పార్టీల అధినేత లతో సమావేశాలు నిర్వహించారు. ఆ చర్చల తరువాతే బీఆర్ఎస్ ఏర్పాటైంది.

పార్లమెంట్ సమావేశాలు జరగుతున్న సమయంలో ఆ పార్టీల నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. కానీ, బీఆర్ఎస్ కార్యాలయానికి దూరం గానే ఉన్నారు. ఏం జరుగుతోంది. జాతీయ స్ఠాయిలో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచేదెవరు. నాటి మంత్రులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు.

బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ ఇద్దరు నేతలు..

బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ ఇద్దరు నేతలు..

జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఏర్పాటు అధికార ప్రక్రియ పూర్తయింది. ఢిల్లీ కేంద్రంగా తాత్కాలిక భవనంలో కార్యాలయం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. శాశ్వత భవనం నిర్మాణంలో ఉంది. కార్యాలయ ప్రారంభోత్సవం ఢిల్లీ కేంద్రంగా సంచలనగా మారుతోందని అంచనా వేసారు. కేసీఆర్ తన జాతీయ పార్టీ ఏర్పాటు క్రమంలో పలువురు పార్టీల నేతల వద్దకు వెళ్లి సమావేశాలు నిర్వహించారు.

మరి కొంత మంది నేతలు హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. బీజేపీ వ్యతిరేకంగా అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కర్ణాటక - యూపీ మాజీ ముఖ్యమంత్రులు కుమార స్వామి- అఖిలేష్ మాత్రమే హాజరయ్యారు. సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్న ఇతర పార్టీల అధినేతలు - ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించ లేదా... లేక, వారే దూరంగా ఉన్నారా అనే చర్చ ఇప్పుడు కీలకంగా మారుతోంది.

మమతా..పవార్..కేజ్రీవాల మద్దతిస్తారా

మమతా..పవార్..కేజ్రీవాల మద్దతిస్తారా

గతంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ - పశ్చిమ బెంగాల్ తో పాటుగా బీహార్, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించారు. ఈ నేతలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారే. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రకటన తరువాత..ఢిల్లీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో ఈ నేతలెవరూ హాజరు కాలేదు. అయితే, కొందరు నేతలు ఢిల్లీలోనే ఉన్నా వారిని ఆహ్వానించలేదని చెబుతున్నారు.

కొందరు నేతలు అందుబాటు లో లేకపోయినా..ఆ పార్టీ ఎంపీలు - నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ అధినేతల ప్రతినిధులు వారూ హాజరు కాలేదు. కేసీఆర్ కు మద్దతు ప్రకటించిన రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ కూడా హాజరు కాలేదు. దీంతో, బీఆర్ఎస్ కు బీజేపీ వ్యతిరేక పార్టీల్లో కలిసి వచ్చేదెవరనే చర్చ మొదలైంది. ఢిల్లీలోనే కార్యాలయం ప్రారంభించినా.. ఆప్ నేతలు రాకపోవటం పైన చర్చ సాగుతోంది. పార్టీ ఏర్పాటుపైన గతంలోనే సీఎం కేసీఆర్ తో చర్చించిన మేధావి వర్గంకి చెందిన వారు కూడా ఈ సమయంలో పెద్దగా కనిపించలేదనే వాదన ఉంది.

ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ సమయంలో...

ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ సమయంలో...

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినప్పుడు ఢిల్లీ కేంద్రంగా జరిగిన హడావుడిని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా చంద్రబాబు ఢిల్లీలో ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. మద్దతిచ్చే వారిని తమ వద్దకు వచ్చేలా చర్యలు తీసుకొనే వారు. కానీ, ఇప్పుడు ఆ విధంగా జాతీయ నేతలు వచ్చి మద్దతుగా నిలవకపోవటం బీజేపీకి అవకాశంగా మారుతుందనే వాదన వినిపిస్తోంది.

కార్యాలయం ప్రారంభం వేళ సీఎం కేసీఆర్ కొన్ని నియామకాలు చేపట్టారు. బీజేపీని ఢీ కొట్టేందుకు వేస్తున్న అడుగుల్లో ప్రతీ సందర్భంలోనూ సరైన ప్రత్యర్ధిగా గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక, సీఎం కేసీఆర్‌ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చేవారం సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారైంది. కొద్ది రోజులు అక్కడే ఉండి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+