వెరీ బ్యాడ్ న్యూస్: అక్టోబరు నుంచి ఆ 10 రైళ్లు కూడా చర్లపల్లి నుంచే!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని రైళ్లను చర్లపల్లి నుంచి, మరికొన్ని రైళ్లు సికింద్రాబాద్ రాకుండా మల్కాజిగిరి మీదుగా నడిపిస్తున్నారు. తాజాగా మరో 10 రైళ్లను కూడా చర్లపల్లి నుంచే నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా ఇవి అక్టోబరు నుంచి సికింద్రాబాద్ కాకుండా చర్లపల్లి నుంచే బయలుదేరనున్నాయి. ఆ రైళ్లు ఏమేమిటనేవి ఒకసారి చూద్దాం.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
సికింద్రాబాద్ - దానాపూర్, సికింద్రాబాద్ - రామేశ్వరం, సికింద్రాబాద్ - మణుగూరు, సికింద్రాబాద్ - రేపల్లె, సికింద్రాబాద్ - యశ్వంత్ పూర్, సికింద్రాబాద్ - అగర్తలా, సికింద్రాబాద్ - ముజఫర్పూర్, సికింద్రాబాద్ - సంత్రగచ్చి, సికింద్రాబాద్ - సిల్చార్, సికింద్రాబాద్ - దర్భంగా రైళ్లు అక్టోబరు 20వ తేదీ నుంచి అక్టోబరు 26వ తేదీ వరకు చర్లపల్లి నుంచే బయలుదేరతాయి. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఆయా రైళ్లను సకాలంలో అందుకునేలా ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతామన్నారని, కానీ ఇంతవరకు ఒక్క ఎంఎంటీఎస్ ను కూడా సరిగా నడపడంలేదని మండిపడుతున్నారు.

కొన్ని రైళ్లు స్థానిక స్టేషన్ల నుంచి..
అలాగే సికింద్రాబాద్ నుంచి పోర్ బందర్ వెళ్లే రైలు ఉందానగర్ నుంచి, సికింద్రాబాద్-సిద్ధిపేట రైలు మల్కాజిగిరి నుంచి, సికింద్రాబాద్-పుణె రైళ్లు హైదరాబాద్ నుంచి బయలుదేరబోతున్నాయి. ఈ మార్పులను గమనించి అందుకనుగుణంగా తమ ప్రయాణ వేళలను మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే మార్పులను జాగ్రత్తగా గమనించాలని, తమ రైలు ఏ స్టేషన్ నుంచి బయలుదేరుతుందో పరిశీలించి ఆ స్టేషన్ కు వెళ్లాలని కోరుతున్నారు. రైల్వే అధికారిక వెబ్ సైట్ తోపాటు రైల్వే యాప్స్ లో కూడా సమాచారం ఉంటుందని, వాటిని గమనించాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications