ఆహార భద్రత,సుస్థిర వ్యవసాయం లక్ష్యంగా జీ20 సమావేశాలు.!వివరాలు వెల్లడించిన కిషన్ రెడ్డి.!
హైదరాబాద్ : జీ20 సమావేశాలకు సంబంధించి హైదరాబాద్ లో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారన్నారు. జీ20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, వ్యవసాయ శాఖ మంత్రులు ఈ సమ్మిట్ లో పాల్గొంటారన్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
వ్యవసాయ రంగానికి దిశానిర్దేశం చేస్తాం..: జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు భారతదేశం అధ్యక్షతన జరుగుతున్నాయని. 2022లో ఇండోనేషియాలో జరిగాయని, ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తర్వాత 2024లో బ్రెజీల్ లో సమావేశాలు జరగనున్నాయని, ఈ సమావేశాలు చాలా కీలకమైనవని, ప్రపంచానికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేసే సమావేశాలు ఇవేనన్నారు కిషన్ రెడ్డి. భారత ప్రభుత్వం, ప్రజలు జీ20 దేశాల సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్నారని, జీ20 సమావేశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని, దేశంలో, ప్రపంచంలోని ప్రజలు ఫాలో అవుతున్నారన్నారు కిషన్ రెడ్డి.

జూన్ 19 నుం చి 22 వరకు గోవాలో జీ20 పర్యాటక శాఖ మంత్రుల సమావేశాలు..: జూన్ 19 నుం చి 22 వరకు గోవాలో జీ20 పర్యాటక శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. పర్యాటక శాఖకు సంబంధించిన తొలి వర్కింగ్ గ్రూప్ సమావేశం గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌లో, రెండోది పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో, మూడోది ఇటీవలే శ్రీనగర్‌లో జరిగిందన్నారు కిషన్ రెడ్డి. పాకిస్థాన్ మరికొన్ని దేశాలు శ్రీనగర్ లో జీ20 టూరిజం సమావేశం నిర్వహించడానికి అభ్యంతరం వ్యక్తం చేశాయని, పాకిస్థాన్ మిలటరీ సవాళ్లు విసిరిందని, వాళ్లు ఇతర దేశాలకు ఉత్తరాలు రాసి తప్పుడు ప్రచారం చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేసారు.
'గోవా రోడ్ మ్యాప్'పై నిర్ణయం తీసుకుంటాం...: గతంలో జరిగిన మూడు సమావేశాల్లోనూ కరోనానంతరం పర్యా టకాన్ని మళ్లీ పట్టాలు ఎక్కించడంతో పాటుగా ప్రపంచ పర్యాటకాభివృద్ధికి పరస్పర సహకారం, పొటెన్షియల్ ఉన్నదేశాలకు సంపూర్ణ సహకారం తదితర అంశాలపై ఆసక్తికరమైన చర్చజరిగిందన్నారు కిషన్ రెడ్డి.ఫైనల్ మీటింగ్ గోవాలో జరగనుందని, గోవా రోడ్ మ్యాప్ పేరుతో టూరిజంకు సంబధించి ఒక డిక్లరేషన్ ఈ సమావేశంలో తీసుకురానున్నామన్నారు కిషన్ రెడ్డి. గోవా రోడ్ మ్యాప్ టూరిజం తీర్మానంపై సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఈ సమావేశాల్లో భారతదేశం కేంద్రంగా క్రూయిట్ టూరిజం అభివృ ద్ధి, ప్రపంచ పర్యాటకాభివృద్ధిలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం అనే అంశంపై మంత్రులు తమ అభిప్రాయాలు తెలియజేస్తారు.

దేశం నలుమూలల సమావేశాలు..: జీ20 ఫైనల్ మీటింగ్స్ సెఫ్టెంబర్ లో జరగనున్నాయి. దానికంటే ముందు మరో శాఖ అయిన సంస్కృతిక శాఖ మీటింగ్స్ వారణాసిలో జరగనున్నాయని, దీనికి సంబంధించి మొదటి సమావేశాలు మధ్యప్రదేశ్ నిర్వహించామన్నారు కిషన్ రెడ్డి. హంపీలో కూడా సమావేశాలు జరగాల్సి ఉందని, ఫైనల్ మీటింగ్స్ వారణాసిలో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి. జీ20 ఫైనల్ మీటింగ్స్ మన దేశంలో ప్రగతి మైదాన్ లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతాయి. జీ20 దేశాలు, ఆతిథ్య దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఈ మీటింగ్స్ కు రానున్నారు." అని కిషన్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications