Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆలయాల్లో వాడే నెయ్యి పరీక్షలకు..!
తిరుమల లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని.. టీడీపీ నేతలు చెబుతుండగా.. కలవలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తిరుమల వెల్లనున్నట్లు ప్రకటించారు. శ్రీఅవారిని దర్శించుకోనున్నారు.
అయితే ప్రస్తుతం తిరుమల లడ్డుపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంలోనే మిగతా ఆలయాల్లోని ప్రసాదాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఆలయాల్లోని ప్రసాదాలను (లడ్డు, పులిహోర) పరీక్షించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో భద్రాచలం, వేములవాడ, బాసర, యాదగిరిగుట్టు, కొండగట్టు, కొమురవెల్లి, ధర్మపురి, కాళేశ్వరం, భద్రకాళి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లోని ప్రసాదాలను పరీక్షించనున్నారు.

భద్రకాళి, బాసర, యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడలో లడ్డు తయారీకి వినియోగిస్తున్న నెయ్యిని పరీక్షలకు పంపించినట్లు సమాచారం. యాదగిరిగుట్ట ఆలయంలో వినియోగించే నెయ్యి శాంపిల్స్ ను హైదరాబాద్ లోని చర్లపల్లి ల్యాబ్ కు పంపినట్లు అధికారులు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో లడ్డు తయారీలో మదర్ డైరీ నెయ్యి వాడుతున్నారు. ఇక బాసర ఆలయంలో కరీంనగర్ డైరీ నెయ్యి వాడుతున్నారు.
తాజాగా ఉన్నతాధికారులతో ఆదేశాలతో విజయ డైరీ నెయ్యి వాడుతున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అలాగే భద్రాచలంలో ప్రసాదాల తయారీకి కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలోనే ల్యాబ్ ఫలితాలు రానున్నట్లు దేవాదాయ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications