ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు పై బంపరాఫర్, డెడ్ లైన్..!!
ఆస్తి పన్ను బకాయి పైన చెల్లింపు పైన కీలక అప్డేట్. పెండింగ్‌లో ఆస్తి పన్ను బకాయిలపై భారీ రాయితీ కల్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీ రాయితీ ప్రకటిస్తూ వన్ టైమ్ స్కీమ్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిల వడ్డీలో 90 శాతాన్ని మాఫీ చేసేందుకు నిర్ణయించారు. దీంతో, గడువు లోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌సూచించారు. పన్ను బకాయిలపై వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్ టైం స్కీమ్ (ఓటీఎస్) ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఓటీఎస్‌కు అర్హులని, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31వ తేదీ వరకు ఓటీఎస్ గడువు ఉందని పేర్కొన్నారు. విలీన మునిసిపాల్టీల పరిధిలోనూ మాఫీ వర్తిస్తుందని, పన్ను చెల్లింపుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బల్దియా పౌర సేవ కేంద్రాలు, బిల్ కలెక్టర్లు, మీ సేవా, ఆన్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా పన్ను చెల్లించవచ్చని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ రాయితీ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తున్నట్టు పురపాలక శాఖ పేర్కొంది.

ఈ నిర్ణయంతో పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను మొత్తంతో పాటు, దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుంది. అయితే 2026 ఆస్తి పన్నుతో పాటు 10 శాతం మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వసూలు చేయడంతో పాటు పన్ను చెల్లింపుదారులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుట్టు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ ఆస్తిపన్నును క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications