ప్రేమోన్మాది వేధింపులతో బాలిక ఆత్మహత్యాయత్నం
ఖమ్మం/ హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మం.బాపూజీతండాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు పాల్పడుతున్న వేధింపులకు తట్టుకోలేక పురుగుల మందుతాగి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థినిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వెంకటేశ్ అనే యువకుడు తనను ప్రేమించాలంటూ కొంతకాలంగా ఆ బాలికను వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. అతడి వేధింపులు తాళలేక ఆ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కార్మికురాలి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసు ఎదుట విషయం తాగి పారిశుధ్య కార్మికురాలు లక్ష్మమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. విధుల నుంచి తొలగించారనే మనస్థాపంతో ఈ దారుణానికి పూనుకున్నట్లు చెబుతున్నారు.
డిమాండ్లను పరిష్కరించాలంటూ 12 రోజులు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సమ్మెలో పాల్గొన్న సుమారు 2000 మందిని తొలగించారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు టి.సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications