ప్రేమిస్తున్నాం: యువతిని ఒకరి తర్వాత ఒకరు 4గురు మోసం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తాండూరు మండలంలో యువతి గర్భవతిని చేసిన కేసులో పోలీసులు నలుగురు యువకులపై కేసు నమోదు చేశారు. ఆదివారం నాడు యువతి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

కిష్టంపేటకు చెందిన ఓ యువతిని యువకులు మాయమాటలు చెప్పి నమ్మించి గర్భవతిని చేశారనే ఆరోపణలు వచ్చాయి. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కలిసేవాడు.

ఈ విషయం తెలుసుకున్న మరో ముగ్గురు యువకులు ఇదే తరహాలో ఆ యువతిని మోసం చేశారు. యువతి ఫిర్యాదు మేరకు ఆదివారం నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్‌ తెలిపారు. ఈ కేసు విషయంలో కిష్టంపేటలో భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Girl cheated in Ranga Reddy district by four youth

ఏటీఎం నుంచి చోరీకి యత్నం

హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దోబీఘాట్ చౌరస్తాలో ఉన్న ఎస్పీహెచ్ ఏటీఎంను బద్దలు కొట్టి నగదును చోరీ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు.

ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల సమాచారం మేరకు క్లూస్ టీం పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. నగదు చోరీ అయిందా లేదా అన్న విషయం తెలియరాలేదు. బ్యాంకు అదికారులు పరిశీలించి చోరీ విషయాన్ని నిర్ధారించనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Girl cheated in Ranga Reddy district by four youth

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X