యువతిపై అత్యాచారం
హైదరాబాద్: రామంతాపూర్ ఇందిరానగర్ కాలనీకి చెందిన మహిళ రాజకుమారి తన కుటుంబ అవసరాలు, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా పలు పనులు చేసి జీవనం కొనసాగిస్తుంది. దీనిలో భాగంగా కర్నూల్ కు చెందిన రమేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ నెల 28న తనను కర్నూల్ రావాలని పోన్ చేశాడు. సరే అన్న రాజకుమారి కర్నూల్ వెళ్ళింది. రమేష్ తన స్నేహితులతో ఆటోలో ఎక్కించుకొని శివారు ప్రాంతానికి తీసుకేళ్లి ఆత్యాచారం చేసారని ఆమె పోలీసుల ముందు వాపోయింది. రమేష్ అతని స్నేహితులు ఇద్దరు మద్యం సేవించి అమెపై విచక్షణ రహితంగా హత్యాచారానికి పాల్పడి గాయపరిచారని పోలీసులకు తెలిపింది. తన ఓంటిపై ఉన్న బంగారు తాళిబోట్టుతో పాటు, సెల్ సోన్ కూడా లాక్కునట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల నుండి అర్ధరాత్రి సమయంలో తప్పించుకొని నగరానికి చేరుకున్నట్లు భాదితురాలు పోలీసుల ముందు వాపోయింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇతర రాష్ట్రం కావడంతో కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేయాలా, తామే కేసును చేదించాలనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు.












Click it and Unblock the Notifications