ప్రేమించినా సరే.. రూ.10 లక్షలు, 10 తులాల బంగారం కావాల్సిందే.. మనస్థాపంతో యువతి..?

ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా మోసపోతుంది మాత్రం.. అమ్మాయిలే.. ప్రేమ పేరు చెప్పి.. వంచించడంలో కొందరు ఆరితేరి ఉంటారు. వారు చెప్పే మాటలు.. చేసే పనుల వల్ల వారు వంచనకు గురవుతుంటారు. ఓ యువతి ఇలానే మోస పోయింది. ఇక చాలు.. తాను బతకలేనని భావించి సూసెడ్ అటెంప్ట్ కూడా చేసింది.

వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లికి చెందిన నవీన్ యువతిని ఛీట్ చేశారు. అతను హైదరాబాద్‌లోని ఒక సూపర్ మార్కెట్‌లో పని చేసేవాడు. యువతి అక్కడే పనిచేసేది. కానీ వీరిద్దరికీ ఆరు నెలల క్రితం పరిచయం అయ్యింది. అదీ ప్రేమగా మారింది. పెళ్ళి వరకు వచ్చింది. తర్వాత అతను ప్లేట్ ఫిరాయించాడు. వారం రోజుల క్రితం యువతి ఇంట్లో చెప్పకుండా యువకుడి ఇంటికి వచ్చింది. ఇక్కడే ఉంటానని మొండికేసింది.

girl suicide attempt at her lover residence

గ్రామ సర్పంచ్, కొందరు పెద్దలు పంచాయతీ పెట్టారు. ఇంట్లో పెద్దవారిని తీసుకుని వస్తే మాట్లాడి ఒప్పిస్తామని యువతికి నచ్చజెప్పి పంపించారు. కుటుంబ సభ్యులు యువతితో కలిసి యువకుడి ఇంటికి వచ్చారు. అక్కడే అసలు కథ మొదలయ్యింది. 10 లక్షల రూపాయల కట్నం, పది తులాల బంగారం ఇస్తే గాని పెళ్ళి చేసుకునేది లేదని యువకుడితోపాటు అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఆ యువతి షాక్ తింది. అక్కడే ఉన్న బ్లేడ్‌తో గొంతు కోసుకుంది. వెంటనే అక్కడున్న వారు స్పందించారు.

వెంటనే పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెళ్ళి చేసుకోమని అడిగితే కట్నం పేరుతో మోహం చాటేశాడని యువతి బంధువులు ఆరోపించారు. దీంతో మనస్థాపం చెంది సూసైడ్ అటెంప్ట్ చేసిందని వారు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+