హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకా ట్రంప్‌కు టిఆర్ఎస్ టిక్కెట్టు: రాత్రికి రాత్రే రోడ్లు,రాజశేఖర్ వీడియో వైరల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇవాంకా ట్రంప్ జీఈఎస్ 2017 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమె పర్యటించే మార్గంలో రోడ్లన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయితే ఇవాంకా ట్రంప్‌కు టిఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వడం గురించి ఆలోచించాలని రాజశేఖర్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతోంది.

జీఈఎస్ 2017:13 ఏళ్ళ అస్ట్రేలియన్ హమీష్‌కు చోటు, యాప్‌ల తయారీలో దిట్టజీఈఎస్ 2017:13 ఏళ్ళ అస్ట్రేలియన్ హమీష్‌కు చోటు, యాప్‌ల తయారీలో దిట్ట

జీఈఎస్ 2017 సదస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రతినిధులు హజరయ్యారు. అయితే ఈ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కల్గించకుండా ఉండేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.

నమస్తే మోడీజీ, నమస్తే ఇవాంకా ట్రంప్: జీఈఎస్‌లో' మిత్ర' రోబోల పలకరింపునమస్తే మోడీజీ, నమస్తే ఇవాంకా ట్రంప్: జీఈఎస్‌లో' మిత్ర' రోబోల పలకరింపు

జీఈఎస్ 2017 సదస్సు సందర్భంగా ప్రతినిధులు తిరిగే ప్రాంతాల్లో రోడ్లను, నగరాన్ని అందంగా ముస్తాబు చేశారు. అయితే ఈ సదస్సు తమ ప్రాంతంలో జరిగితే బాగుండేది, మా ప్రాంతం కూడ బాగుపడేదంటూ చాలా మంది నెటిజన్లు సెటైర్లు గుప్పించారు.

ఇవాంకాకు టిఆర్ఎస్ టిక్కెట్టు

ఇవాంకాకు టిఆర్ఎస్ టిక్కెట్టు

ఇవాంకా ట్రంప్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం గురించి టీఆర్ఎస్ ఆలోచించాలి. సిద్ధిపేట లేదా సిరిసిల్ల నుంచి పోటీ చేయించాలి. ఎందుకంటే మేం ఆమెకు ఓటు వేస్తాం. అందుకామె అర్హురాలు. గో ఇవాంకా! అంటే, కమ్ బ్యాక్ ఎగైన్ , వెనెవర్ యు కెన్! అంటూ రాజశేఖర్ అనే వ్యక్తి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవాంకా పర్యటనను పురస్కరించుకొని నగరంలో రోడ్ల రూపు రేఖలు మారిపోయాయంటూ ఆయన ఈ వీడియోలో ప్రస్తావించారు. అంతేకాదు రెండు మాసాల క్రితం రోడ్లపై తాము పడిన ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.

2 నెలల క్రితం రోడ్లు ఇలా

2 నెలల క్రితం రోడ్లు ఇలా

భాగ్య నగరంలో కొన్ని రోడ్లు రెండు నెలల్లోనే చాలా మారిపోయాయి. అందంగా ముస్తాబై కళకళలాడుతున్నాయి. ఆహా! మన భాగ్యనగరం ఎంత సౌభాగ్యవంతమైంది! అని అందరూ సంతోషిస్తున్నారు. వర్షాకాలంలో గుంతలతో ఇబ్బంది పెట్టిన రోడ్లు, ఇప్పుడు ఆహ్లాదకరంగా తయారవడంపై రాజశేఖర్ అనే నెటిజన్ పోస్ట్ చేశారు. కొత్త రోడ్లు వచ్చాయని ఆయన సంతోషపడ్డారు.

రోడ్లను బాగు చేయాలంటూ పిటిషన్

రోడ్లను బాగు చేయాలంటూ పిటిషన్

హైదరాబాద్‌ను చూసి చాలా గర్విస్తున్నానని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. నెల క్రితం ఛేంజ్ డాట్ కామ్‌లో ఆన్‌లైన్ పిటిషన్ వచ్చింది. దయచేసి హైదరాబాద్ ప్రజలకు సరైన రోడ్డు సదుపాయం కల్పించండి, లేదంటే మేం చెల్లించిన రోడ్డు ట్యాక్స్‌ను తిరిగి ఇచ్చేయండి అని ఆ పిటిషన్‌లో కోరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.దీని మీద చాలా మంది సంతకాలు చేశారు. దాని ఫలితం కనిపిస్తోందని అనుకున్నానని రాజశేఖర్ వ్యంగ్యోక్తులు విసిరారు.

పుట్‌పాత్, రోడ్డుకు మధ్య తేడా

పుట్‌పాత్, రోడ్డుకు మధ్య తేడా

నగరంలో అద్భుతమైన రోడ్లు కనిపిస్తున్నాయి. కొత్త రోడ్లు వచ్చాయ్, రోడ్లేనా, ఫుట్‌పాత్‌లు కూడా వచ్చాయ్, 2010 నుంచి నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. నా జీవితంలో మొదటిసారి ఫుట్‌‌పాత్, రోడ్డు మధ్య తేడాను గమనించగలుగుతున్నానని రాజశేఖర్ సెటైర్ వేశారు. డివైడర్ మీద గడ్డి కనిపిస్తోంది. రోడ్ల పక్కన అందమైన బెంచీలను పెట్టారు. అద్భుతం! ఇది హైటెక్ సిటీ! ఫుట్ పాత్‌ల మీద బెంచీలు ఎవరికి కావాలి? మేం పని చేసే కంపెనీల్లో ఉన్నాయి. అక్కడ మేం కూర్చుంటాం. ఏది ఏమైనప్పటికీ, ఈ రోజుల్లో హైదరాబాద్ అద్భుతంగా కనిపిస్తోంది. క్రేజీ అందాలతో రోడ్లు మెరిసిపోతున్నాయి. కొందరు దీన్ని ట్విస్ట్ చేస్తున్నారని ఆయన చెప్పారు.

శివాజీ సినిమాలో మాదిరిగానే

శివాజీ సినిమాలో మాదిరిగానే

ఇవాంకా ట్రంప్ వల్లనో, పిటిషన్ వల్లనో, ఏదైతేనేం ఈ సమయంలో హైదరాబాద్ రోడ్లు చాలా అందంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. రెండు నెలల క్రితం వరకు రోడ్లు చాలా చెత్తగా ఉండేవి. ఇప్పుడు రోడ్లను రాత్రికి రాత్రే వేస్తున్నారు. కొత్తగూడ నుంచి హైటెక్ సిటీ వరకు ఒక రాత్రిలోనే రోడ్డు వేశారు. ఇంత వేగంగా రోడ్లు వేయడాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఇంత వేగంగా రోడ్లు వేయడాన్ని రజినీకాంత్ సినిమా ‘శివాజీ'లోనే చూశాను. రజినీకాంత్ నడుస్తూ ఉంటే, ఆయన వెనుక తారు రోడ్డు పడుతూ ఉంటుందని రాజశేఖర్ చమత్కరించారు.

ప్రపంచ స్థాయి సదస్సులతో హైద్రాబాదీల కష్టాలు తీరుతాయి

ఇవాంకా ట్రంప్ విజిట్‌తో మైండ్‌స్పేస్ చుట్టుపక్కల ఉన్న షాపులన్నిటినీ తొలగించారు. బిచ్చగాళ్ళను కూడా అక్కడి నుంచి పంపించేశారు. సమస్యలను పరిష్కరిస్తున్నారని నేను అనుకోవడం లేదు. కేవలం అలంకరిస్తున్నారు. ఫొటోషాపింగ్ చేస్తున్నారని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. 2013లో బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ హైదరాబాద్‌లో జరిగింది. అప్పుడు చాలా పునరుద్ధరణ పనులు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి. అంతర్జాతీయ డెలిగేట్లు వస్తున్నారు కాబట్టి జరుగుతున్నాయి. ఇలాగే ప్రతిసారీ ఏదో ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండాలి. ఒలింపిక్స్, వింబుల్డన్, ఆస్కార్ వంటివి హైదరాబాద్‌లో జరగాలి. ఏదైతేనేం పిటిషన్ వల్లనో, ఇవాంకా ట్రంప్ వల్లనో మన హైదరాబాద్ రోడ్లు బాగుపడ్డాయని వ్యంగ్యోక్తులు విసిరారు.

English summary
“The last time I saw a road laid so fast was in the Rajinikanth movie Sivaji,” says Hyderabad-based comic Rajasekhar Mamidanna. On screen, a scene from the film plays out, showing the superstar walking down a rural landscape as a tar-road unfolds in fast forward behind him.But Rajasekhar isn’t singing praises of Rajini in his comedy video going viral on social media. No, he’s paying tribute to Ivanka Trump, thanks to whom Hyderabad is undergoing a radical makeover, he says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X