తెలంగాణ బీజేపిలో సినీ గ్లామ‌ర్..! ఎన్నిక‌ల‌ బ‌రిలో తార‌లు..!!

హైద‌రాబాద్: తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బీజేపి ఒంట‌రిగా పోటీలోకి దిగుతోంది. ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆ పార్టీ ఈ సారి మాత్రం సొంత సామ‌ర్థ్యాన్ని న‌మ్మొకొంటోంది. అమీత్ షాతో పాటు మోదీని తెలంగాణ‌లో ప్ర‌చారంలో వినియోగించుకుంటే మంచి ప్ర‌భావం ఉంటుంద‌ని తెలంగాణ బీజేపి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. దాంతో పాటు ప్ర‌జ‌ల్లో ఎప్పుడూ నానుతుండే సినీ గ్లామ‌ర్ ను కూడా ఈ ఎన్నిక‌ల్లో వాడుకోవాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఏకంగా ఇద్ద‌రు క‌ధానాయిక‌ల‌ను ఎన్నిక‌ల రంగంలోకి దించి ముంద‌స్తు పోల్ ను సూప‌ర్ పోల్ గా మార్చాల‌ని బీజేపి భావిస్తోంది.

జనాకర్షకమైన మేనిఫెస్టోతో పాటు ఆక‌ర్శ‌ణీయ‌మైన ప్ర‌చారం కోసం బీజేపి ప్ర‌య‌త్నం..!

జనాకర్షకమైన మేనిఫెస్టోతో పాటు ఆక‌ర్శ‌ణీయ‌మైన ప్ర‌చారం కోసం బీజేపి ప్ర‌య‌త్నం..!

తెలంగాణలో అంతంత మాత్రంగా ఉంది భారతీయ జనతా పార్టీ పరిస్థితి. అందుకోసమే త్వరలో జరగబోయే ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకుని, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బీజేపీ, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జనాకర్షకమైన మేనిఫెస్టోను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న ఆ పార్టీ అధిష్ఠానం, ఎన్నికల కోసం సినీ గ్లామర్‌ను కూడా వాడుకోవాలని నిర్ణయించుకుందట. అందుకోసమే కొద్దిరోజుల క్రితం ఆ పార్టీలో చేరిన ఇద్దరు తెలుగు యువ కథానాయికలను ఎన్నికల బరిలో దింపాలని చూస్తోందని సమాచారం. దీనిపై ఇప్పటికే రాష్ట్ర నేతలు వారితో చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. త్వరలోనే వారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని టాక్.

రంగంలోకి హీరోయిన్లు మాధవీ లత, రేష్మా రాథోడ్..! ప్ర‌భావం చూపిస్తారా..?

రంగంలోకి హీరోయిన్లు మాధవీ లత, రేష్మా రాథోడ్..! ప్ర‌భావం చూపిస్తారా..?

తెలుగు తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న తెలుగు హీరోయిన్లు మాధవీ లత, రేష్మా రాథోడ్ కొద్దిరోజుల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సినీ రంగంలోని కొందరు ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవాలని భావించిన బీజేపీ.. ఇందులో భాగంగానే మాధవీ లత, రెష్మా రాథోడ్‌లను బీజేపీలోకి ఆహ్వానించి, వారికి సుముచిత స్థానం కల్పించారు. మాధవీలత పార్టీ కండువా కప్పుకున్న తర్వాత పెద్దగా కనిపించలేదు కానీ, మరో నటి రెష్మా మాత్రం బీజేపీ యువజన విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయింది.

వైరా బ‌రి నుండి రేష్మా...! ప్ర‌చారానికి మాధ‌వీల‌త‌..!!

వైరా బ‌రి నుండి రేష్మా...! ప్ర‌చారానికి మాధ‌వీల‌త‌..!!

దీంతో ఆ పార్టీలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతూ, పార్టీ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అధిష్టానాన్ని ఆకర్షించింది. దీంతో ఈమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన రెష్మా, తన జిల్లా అయిన ఖమ్మంలోని వైరా నియోజకవర్గం నుంచి అసెంబ్లీపై కన్నేసింది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ స్థానాన్ని బీజేపీ వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేని కారణంగానే రెష్మా ఈ స్థానాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

బీజేపీ లో కొత్త ఒర‌వ‌డి..! సినీ గ్లామ‌ర్ ఓట్లు రాల్చుతాయా..?

బీజేపీ లో కొత్త ఒర‌వ‌డి..! సినీ గ్లామ‌ర్ ఓట్లు రాల్చుతాయా..?

వైరా నియోజకవర్గం నుంచి కాకుండా బీజీపీ అధిష్ఠానం మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రొఫెసర్‌ సీతారాం గెలుపొందారు. ఈనేపథ్యంలో ఎస్టీ ఓట్లను పొందేందుకు రేష్మను బీజేపీ రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. సినీతార పైగా ఈ ప్రాంత వాసులతో సంబంధబాంధవ్యాలుండటం, గిరిజన యువతి కావడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మాధవిని కూడా ప్రచారానికి వాడుకోవాలని చూస్తోందట బీజేపీ అధిష్ఠానం.
v

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+