కాంగ్రెస్ తో వెళ్లడం అంటే కుక్కను పట్టుకొని గోదారిని ఈదడం లాంటిదే.!మంత్రి కేటీఆర్ ఫైర్.!

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో ఖమ్మం జిల్లా నుంచి చేరికల సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వెళ్లడం అంటే కుక్కను పట్టుకొని గోదారిని ఈదడం లాంటిదనే విషయం వెంకట్రావుకి నెల రోజుల్లోనే అర్థమైందని, తిరిగి పార్టీలో చేరుతున్నందుకు తారక రామారావు అభినందనలు తెలిపారు. ఆయన ద్వారా చేరిన పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందని, ఒకప్పుడు కొమురం భీం కోరుకున్న జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్.

కోటి ఎకరాల మాగానంగా తెలంగాణ : ఒక్క వర్షాకాలంలోనే కోటి ఎకరాల జమీన్ లో పంటను తెలంగాణ ఈరోజు సాగు చేస్తుందని, తెలంగాణ మొత్తంగా భూమాత పచ్చ చీర కట్టుకున్నదా అన్న తీరుగా తెలంగాణ రైతాంగం పంటలు పండిస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు అనుకునే తెలంగాణ కోటి రతనాల వీణ... ఈరోజు కోటి ఎకరాల మాగానంగా మారిందని, ఇది సీఎం చంద్రశేఖర్ రావు వల్లనే సాధ్యమైందన్నారు కేటీఆర్. ఒకప్పుడు మంచం పట్టిన మన్యం అనే వార్తలు వస్తుండేవని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు.

Going with Congress is like holding a dog and swimming across the river. Minister KTR Fire!
దేశానికే మిషన్ భగీరథను ఆదర్శం : ఇంటింటికి నీరు ఇవ్వాలన్న లక్ష్యాన్ని సాధించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని, మన ముఖ్యమంత్రి జాతిని మేల్కొల్పిన తర్వాత మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని జల్జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టిందని, కాంగ్రెస్ పాలిత చతిస్గడ్ రాష్ట్రంలో... గోదావరి అవతల ఉన్న ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అని, మరి తెలంగాణలో నాలుగు లక్షల 50 వేలు ఎకరాల పోడుభూమి పట్టాలు ఇచ్చినట్లు ఛత్తీస్గడ్ల ఇచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Going with Congress is like holding a dog and swimming across the river. Minister KTR Fire!
కాంగ్రెస్ ను నమ్మకండి : కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న చత్తీస్గడ్ లో రైతుబంధు రైతు బీమా ఉందా అని, 24 గంటల ఉచిత విద్యుత్తు వ్యవసాయ రంగానికి అక్కడ ఉన్నదా అని, పండించిన పంట మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం కొంటె మరి కాంగ్రెస్ చత్తీస్గడ్ లో కొంటున్నదా అని, కాంగ్రెస్ పాలిత చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి రైతులు తెలంగాణకు వచ్చి తమ పంటను అమ్ముకుంటున్నారని, మరి రైతులకు సహాయం చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ నిలదీసారు. కమ్యూనిస్టులు, నక్సలైట్లు ఒకప్పుడు చెప్పిన సమమాజ స్థాపన ఇప్పుడు జరుగుతున్నదన్నారు మంత్రి కేటీఆర్.

Going with Congress is like holding a dog and swimming across the river. Minister KTR Fire!
గులాబీ గెలుపులో ఖమ్మం జిల్లా కీలకం : తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించిన తర్వాత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు రూపొందించారని, మూడోసారి గెలిచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సీఎంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారన్నారు మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లాలో ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీ సైనికులుగా పనిచేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, రానున్న మూడు నెలల్లో ప్రతి ఇంటి గడపకు వెళ్లి, అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+