బంగారం ప్రియులకు పండుగలాంటి వార్త.. భారీగా బంగారం ధరల పతనం, తెలుగురాష్ట్రాల్లో ఎంతంటే
బంగారం ప్రియులకు పండగలాంటి వార్త. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో బంగారం షాపుల వంక చూడడమే మానేశారు. అయితే ప్రస్తుతం మళ్ళీ తగ్గుతున్న ధరలతో బంగారం కొనుగోలు పైన ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో నేడు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.
భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 96 వేల 60 రూపాయలు ఉండగా, మే 15 నేటికి 2130 రూపాయలు తగ్గి 93,930 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర మే 14న కిలో 99 వేల 100 రూపాయలు ఉండగా, మే 15 నాటికి 2320 రూపాయలు తగ్గి 96 వేల 780 రూపాయలకు చేరింది.

దేశంలో బంగారం ధరలు ఇలా
ఇక ప్రస్తుతం భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 86 వేల 100 రూపాయలుగా ఉంది. నిన్నటి కంటే 1950 రూపాయల మేర ధర తగ్గింది. ఇటు 24 క్యారెట్ల బంగారం ధర 2130 రూపాయలు తగ్గి 93,930 రూపాయలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 86 వేల 250 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 94,080 రూపాయలుగా ఉంది.
ముంబై, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలిలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 86, 100 రూపాయలు గానూ, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 93,930 రూపాయలు గాను ప్రస్తుతం అమ్ముడవుతోంది. ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 86 వేల వంద రూపాయలు గానూ, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 93,930 రూపాయలు గాను ప్రస్తుతం కొనసాగుతుంది.
బంగారం ధరల తగ్గుదల బిగ్ రిలీఫ్
ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3232 డాలర్లు ఉండగా నేడు 82 డాలర్లు తగ్గి 3150 కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ తో పాటు దేశీయ మార్కెట్లలో కూడా బంగారం ధర తగ్గుదల బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్ అని చెప్పాలి.












Click it and Unblock the Notifications