అండర్ వేర్ లో అరకిలో బంగారం..శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. బంగారం అక్రమ రవాణా చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నా సరే అక్రమార్కులు బంగారం అక్రమ రవాణా చెయ్యాటానికి శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. పురుషులు మాత్రమే కాదు విద్యార్థులు ,మహిళలు సైతం విదేశాల నుండి బంగారం అక్రమ రవాణాకు ఎవరికీ దొరకకుండా రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు.
తాజాగా అండర్ వేర్ లో దాదాపు అరకిలో బంగారు ఆభరణాలను దాచి తరలిస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తి నుండి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానంలో హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు అతనిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అతనిలోదుస్తులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ జేబులో 475 గ్రాముల బంగారాన్ని గుర్తించి ఆ బంగారాన్ని బయటకు తీశారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 24.8 లక్షలు ఉంటుందని సమాచారం. బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్న క్రమంలో వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశామని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ డిప్యూటీ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కస్టమ్స్ అధికారులకు పట్టుబడకుండా ఈ తరహా చర్యలకు పాల్పడడం నిత్యకృత్యం అయిపోతున్నాయి. బంగారం అక్రమ రవాణా చేయాలనుకుంటే కేసుల పాలు అవుతారంటూ కస్టమ్స్ అధికారులు, ఎయిర్ పోర్ట్ పోలీసులు హెచ్చరిస్తున్నా అక్రమార్కులు నిత్యం ఏదో ఒక రకంగా అడ్డదారిలో బంగారం అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కస్టమ్స్ అధికారులకు, ఎయిర్ పోర్ట్ పోలీసులకు అడ్డంగా పట్టుబడుతున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications