భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నేడు హైదరాబాద్, విజయవాడలలో ధరలిలా!
నిన్న మొన్నటి వరకు బంగారం ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడేలా చేశాయి. గత నెలలో రికార్డు స్థాయిలో బంగారం ధర లక్ష రూపాయల మార్కును దాటి దూసుకుపోయింది. ఇక ప్రస్తుతం ఈ నెలలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆల్ టైమ్ హై నుంచి దాదాపు 7000 రూపాయలు మేర బంగారం ధర తగ్గి కాస్త ఊరటనిచ్చింది.
నేడు తగ్గిన బంగారం ధరలు
నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలలో తగ్గుదల కనిపించడం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ రిలీఫ్. నేడు బంగారం 10 గ్రాముల ధర 24 క్యారెట్ల బంగారానికి 490 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 450 రూపాయలు మేర తగ్గుదల నమోదు చేసింది. కాగా నేడు దేశవ్యాప్తంగా ఉన్న బంగారం ధరల విషయానికొస్తే..

దేశంలో బంగారం ధరలిలా
దేశంలో నేడు 24 క్యారెట్ల బంగారం ధర 95,020గా ఉంది. నిన్న ఆ ధర 95,510 గా కొనసాగింది. మొత్తం 490 రూపాయల మేర బంగారం ధర తగ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 87 వేల వంద రూపాయలుగా కొనసాగుతుంది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87 వేల 550 రూపాయలుగా ఉంది.
ఢిల్లీ, ముంబైలలో నేడు ధరలిలా
దేశంలోని ప్రధాన నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95 వేల 170 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87 వేల 250 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,100 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,020 రూపాయలుగా కొనసాగుతుంది.
విజయవాడ, హైదరాబాద్ లలో బంగారం ధరలిలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 87 వేల 100 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,020 గా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87 వేల 100 రూపాయలు కాక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,020 రూపాయలు.
ధరల తగ్గుదలతో మళ్ళీ చిగురాశ
ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్న క్రమంలో మరికాస్త ధరలు తగ్గితే బాగుండని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ధరల తగ్గుదలతో ప్రతి ఒక్కరు మళ్లీ బంగారం వైపు ఫోకస్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications