లక్షల మంది రైతులకు గుడ్‌న్యూస్: రైతు భరోసా నిధులు జమ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతుభరోసా నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలోని 17.03 లక్షల రైతుల అకౌంట్లలో జమ చేశారు. రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు.

ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈరోజు (బుధవారం) వరకు మొత్తం1126.54 కోట్లు రైతు భరోసా నిధులు జమ అయినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటికే రైతుబంధుకు 7625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు భీమాకు 3000 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.

Good news for 17 lakh farmers Rythu Bharosa funds deposited in Telangana

పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నడూలేని విధంగా రూ. 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్ధతుధరకు సేకరించామన్నారు. త్తిపంటను పూర్తిగా సేకరించడానికి గడువుకోరారు.
రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులు పంటలను మార్క్ ఫెడ్ ద్వారా రైతుల వద్ద నుంచి మద్ధతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి వివరించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు పెరిగాయన్నారు. వరిపంటను మద్ధతు ధరకు ప్రభుత్వం కోనుగోలు చేస్తోంది. యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, 10,547 కోట్లు. ఖరీఫ్ లో 52.51 లక్షల మెట్రిక్ టన్నులు, 12,178.97 కోట్లు. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు, అందుకు 1154 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగించనున్నట్లు మంత్రి తెలిపారు. పసుపు, మిరప పంటలకు మద్ధతు ధర నిర్ణయించడానికి కేంద్రప్రభుత్వానికి విజ్ఙప్తులు చేసినట్లు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్భంది చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఎరువుల కేటాయింపుల కోసం విజ్ఙప్తులు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+