హైదరాబాదీలకు సంక్రాంతికి సూపర్ న్యూస్.. 16ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అక్కడ ప్రత్యేక హాల్టింగ్!

రైలు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూనే ఉంది. ముఖ్యంగా పండుగలను దృష్టిలో పెట్టుకొని ముందు నుండే కీలక నిర్ణయాలు తీసుకునే రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు మరొక శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక కీలకమైన సౌలభ్యాన్ని కల్పించింది.

సంక్రాంతికి సూపర్ న్యూస్
ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయంతో ఐటీ ఉద్యోగులు సైబరాబాద్ ప్రాంతంలో నివసించేవారు లబ్ధిని పొందనున్నారు.దక్షిణ మధ్య రైల్వే అధికారులు జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీవరకు సికింద్రాబాద్- లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్లో తాత్కాలిక హాల్టింగ్ ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి cpro శ్రీధర్ తెలిపారు.

Good news for hyderabadis 16 express trains will have special halting at hitech city railway station

Take a Poll

గతంలో రైలు ఎక్కటానికి వెళ్ళాలంటే ఇబ్బంది
సాధారణంగా దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి వంటి ప్రధాన స్టేషన్ల నుంచే బయలుదేరుతాయి అని, ఈ క్రమంలోనే హైటెక్ సిటీ స్టేషన్లో తాత్కాలిక హాల్టింగ్ ఏర్పాటు చేయడం ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు.ముఖ్యంగా జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులు ఇంతకుముందు సంక్రాంతి పండుగకు ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటేఇబ్బంది ఉండేది.

ఈ హాల్టింగ్ స్టేషన్ తో ప్రయాణికులకు సౌకర్యం
రైలు ఎక్కడానికి రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇక ముఖ్యంగా సంక్రాంతి సమయంలో విపరీతమైన రద్దీ ఉండడంవల్ల ఆ సమస్య మరింత తీవ్రతరంగా ఉండేది. హైదరాబాద్ ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉన్న హైటెక్ సిటీ స్టేషన్లో ఈ ప్రత్యేక హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించడం వల్ల ప్రయాణికులకు అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి.

ప్రధాన స్టేషన్లలో అనవసరమైన రద్దీని తగ్గించే నిర్ణయం
ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రధాన స్టేషన్లలో అనవసరమైన రద్దీని తగ్గించడంలో ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుంది. రైల్వే అధికారులకు సైతం సంక్రాంతి రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం ఈజీ అవుతుంది. ఈ క్రమంలోనే జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 16 ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి టికెట్స్ బుక్ చేసుకునే వారు హాల్టింగ్ స్టేషన్ హైటెక్ సిటీగా ఎంచుకునే అవకాశం ఉంది.

రెండు వారాల తాత్కాలిక హాల్టింగ్
అయితే ఇది రెండు వారాల తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, పండుగల సమయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం కోసం రైల్వే శాఖ ఇటువంటి తాత్కాలిక ఏర్పాట్లను చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం.. సంక్రాంతి పండుగ ప్రయాణాలకు ప్లాన్ చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+