హైదరాబాదీలకు శుభవార్త..గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!

నిత్యం ట్రాఫిక్ తో సతమతమయ్యే హైదరాబాదీలకు శుభవార్త. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి త్వరలోనే మరొక కీలక ఫ్లై ఓవర్ అందుబాటులోకి రాబోతుంది. జూన్ 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు.

గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లై ఓవర్
శిల్ప లేఅవుట్ ఫేజ్ టు ఫ్లై ఓవర్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్ కు దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల పొడవుతో, 6 లేన్లతో విస్తరించి ఉంది. దీని నిర్మాణానికి సుమారు 178 కోట్లు ఖర్చయింది.

Good news for Hyderabadis Gachibowli Kondapur flyover is ready cm revanth going to inaugurate on june 28th

Take a Poll

ఈ మార్గంలో వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మించిన మూడవ ఫ్లైఓవర్. ఇప్పటికే ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, శిల్ప లేఅవుట్ ఫేజ్ వన్ ఫ్లైఓవర్ ఉండగా ప్రస్తుతం శిల్పా లే అవుట్ ఫేజ్ టు ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఇది అందుబాటులోకి వస్తే ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి.

పనులు పూర్తి, కొనసాగుతున్న సుందరీకరణ
ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్. హఫీజ్ పేట వైపు వెళ్లే వాహనదారులకు ఈ ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఏర్పడే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి.

త్వరలో హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానున్న ఫ్లై ఓవర్
ఈ ఫ్లై ఓవర్ ను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల నిమిత్తం, ఇతర ప్రయాణికుల నిమిత్తం సులభంగా ఉంటుందని, వారి ప్రయాణాలకు వెసులుబాటు కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లను విస్తరించడంతో పాటు, కొత్త రహదారులను నిర్మించడం ద్వారా ట్రాఫిక్ రద్దీకి చెక్ పెడుతున్నటువంటి ఎస్ ఆర్ డి పి ప్రోగ్రాం లో ఈ ఫ్లైఓవర్ ను అభివృద్ధి చేశారు. ఇది త్వరలోనే హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+