శుభవార్త.. పండుగ ప్రత్యేక రైళ్లు ప్రకటించిన భారతీయ రైల్వే!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే ఎప్పుడూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా మౌలిక వసతులను కల్పిస్తోంది. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా ముందుగానే తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో రానున్న దసరా, దీపావళి వంటి పండుగల సీజన్లో రద్దీని నివారించడానికి రైల్వే రెడీ అవుతోంది.
పండుగ ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన భారతీయ రైల్వే
ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణం చేసేలా అదనపు రైలు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో లక్షలాది మంది ప్రయాణికులు సెలవుల కారణంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వారి ప్రయాణం సులభతరం చేయడానికి భారతీయ రైల్వే తొలి విడతగా 150 ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.

ప్రత్యేక రైళ్ళ తేదీలు ఇవే
ఈ రైళ్ళు సెప్టెంబర్ 21వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రధాన మార్గాలను కవర్ చేస్తాయి. మొత్తం ఈ రైళ్ళు 2024ట్రిప్పులను ఈ పండుగ సీజన్లో తిరగనున్నాయి. ప్రతి పండుగ సీజన్లోనూ దక్షిణ మధ్య రైల్వే అత్యధిక సంఖ్యలో రైళ్లను నడుపుతుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం తిరుగుతున్న రైళ్ల తో పాటు ప్రత్యేక రైళ్లను కలిపి మొత్తం 48,684 ట్రిప్పులను పూర్తి చేస్తాయి.
పండుగల సీజన్ లో ముందు వరుసలో సౌత్ సెంట్రల్ జోన్
ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్, మరియు విజయవాడ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందించడం ద్వారా తన సేవలను అందిస్తుంది. ప్రయాణ సమయంలో అదనపు రైళ్ల ద్వారా ప్రయాణికులకు భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈసారి దక్షిణ మధ్య రైల్వే నుండి హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ మార్గాలలో తొలివిడత ప్రకటన ప్రకారం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
పండుగ ప్రత్యెక రైళ్ళ మొదటి విడత ప్రకటన.. ఇంకా ప్రకటించే అవకాశం
ఇది పండుగ ప్రత్యేక రైళ్లకు సంబంధించి మొదటి దశ ప్రకటన మాత్రమేనని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. పండుగల సమయంలో పెరుగుతున్న డిమాండ్ ను బట్టి రైల్వే సంఖ్యను పెంచుతూ పోతుంది. ఇక రాబోయే వారాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏ ఏ ప్రాంతాలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది? గతంలో ఏర్పాటు చేసిన రైళ్లు ఎన్ని? తదితర అన్ని వివరాలను బేరీజు వేసుకొని భారతీయ రైల్వే మళ్ళీ పండుగల ప్రత్యేక రైళ్ల ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications