రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా టికెట్ పొందండి!!
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఇకనుంచి ప్రయాణికుల కష్టాలకు చెక్ పెడుతున్నట్టు వెల్లడించింది. టికెట్ తీసుకునే సమయంలో నగదు సమస్యకు పరిష్కారాన్ని సూచించినట్టు రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు.
శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో యూపీఐ నగదు చెల్లింపులలో భాగంగా క్యూఆర్ కోడ్ స్కానర్ లను తీసుకువచ్చినట్టు దీంతో ప్రయాణికులకు నగదు కష్టాలు ,చిల్లర కష్టాలు ఇక ఉండబోవని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఎంతో కాలంగా ప్రయానికుల విజ్ఞప్తులపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

టికెట్ కొనాలంటే నగదే..తీవ్ర ఇబ్బంది పడిన ప్రయాణికులు
చాలా కాలంగా దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రజలు అన్నిచోట్ల డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడడంతో రైల్వేస్టేషన్లో టికెట్ కొనేటప్పుడు మాత్రం నగదు చెల్లించాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ విషయాన్ని అనేకమార్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ప్రయాణికులు తెలియజేశారు.
ప్రయాణికుల విజ్ఞప్తులతో స్పందించిన రైల్వే
యూపీఐ చెల్లింపులు విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నగదు క్యారీ చేయడం లేదని, కాబట్టి రైల్వేస్టేషన్లో టికెట్ కొనుగోలుకు కూడా యూపీఐ చెల్లింపులకు క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు . దీంతో తాజాగా దక్షిణ మధ్య రైల్వే తమ జోన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ టికెట్లు జారీ విషయంలో క్యూఆర్ కోడ్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.
అన్ని రైల్వే స్టేషన్ లలోనూ క్యూఆర్ కోడ్ స్కానర్స్
అంతకుముందు టికెట్లు కొనుగోలు కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ స్కానర్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కోసారి ప్రజలు ఏటీఎం సెంటర్ల వద్దకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ఇక చిల్లరకైతే నరకం కనిపించేది. కానీ ఇప్పుడు అన్నిచోట్ల డిజిటల్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేయడంతో ఇకపై నగదుకు, చిల్లరకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని రైల్వే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ చెల్లింపులకు మరింత ఊతమిస్తుందని వారు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications