రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జోరుగుతున్న సాగుతున్న క్రమంలో వాటికి ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. అధికారంలోకి రాగానే ప్రజలకు శుభవార్తలు వినిపించిన సీఎం రేవంత్.. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని పథకాల ప్రారంభాన్ని వాయిదా వేశారు. తాజాగా ఆయన తెలంగాణ రైతులకు తీపికబురు వినిపించారు. ఒక్క పేద కుటుంబానికి కూడా అన్యాయం జరగనివ్వనని, అన్ని పథకాలను వారిచెంతకు తీసుకువస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారు. తాజాగా రైతుల రుణమాఫీపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు 15 నాటికి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న 69 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ కచ్చితంగా అమలవుతుందని, బోనస్ కూడా ఇస్తామని సీఎం అంటున్నారు. రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని, ఒకే విడతలో రూ.2 లక్షలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15వ తదీ నాటికి మొత్తం రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. వరిపంటకు రూ.500 బోనస్ గా ఇవ్వనున్నారు. రుణమాఫీకి సంబంధించి వివిధ బ్యాంకులతో విధివిధానాల రూపకల్పనకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రైతుల రుణమాఫీ గైడ్ లైన్స్ ప్రకటిస్తారు. ఇప్పటికే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ లిమిట్ 10 లక్షలకు పెంచడంతోపాటు గృహ జ్యోతి అమలు చేసింది. రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఇది సంతోషాన్ని కలిగిస్తుందని, ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి ఆరు గ్యారంటీల అమలుపై కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విధివిధానాలను సిద్ధం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications