Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిరుద్యోగులకు అదిరిపోయో న్యూస్.. రూ.3 లక్షలు ఎకౌంట్ లోకి..

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణాలివ్వనుంది సర్కార్. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు రాజీవ్ యవ వికాసం దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6 నుంచి మే31 వరకు దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేయనుంది ప్రభుత్వం. 5 లక్షల మంది యువతకు రూ 6 వేల కోట్లు ఇవ్వనుంది.

Good News for Telangana s Unemployed Rs 3 Lakhs to Be Credited Under Rajiv Yuva Vikasam Scheme

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గరిష్టంగా 3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వనుంది. కేటగిరి 1,2,3 వారీగా రుణాలివ్వనుంది. కేటగిరీ 1 కింద రూ.లక్ష వరకు లోన్ 80 రాయితీ ఉంటుంది. కేటగిరి 2 కింద రూ.2లక్షల వరకు రుణం 70 శాతం రాయితీ, కేటగిరి 3 కింద రూ. 3 లక్షల లోపు రుణం 60 శాతం రాయితీతో ఇవ్వనుంది.

జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్​ జాబితా ప్రకటిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్​ యువ వికాసం పథకం అమలు చేస్తే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+