Indian railways: తెలంగాణాకు రైల్వే తీపికబురు!
తెలంగాణ రాష్ట్ర రైల్వే రూపురేఖలు మార్చడంలో దక్షిణ మధ్య రైల్వే కీలకపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి ఉత్తర రాష్ట్రాలకు రైలు రవాణాలో కీలకమైన కాజీపేట-బల్లార్ష మార్గంలో రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి. అయితే, రైళ్ల వేగం పెంచేందుకు, రద్దీ తగ్గించేందుకు మూడో, నాలుగో లైన్ల నిర్మాణం చేపట్టిన రైల్వే ఆ పనుల వేగాన్ని పెంచింది.
రైల్వే మూడో లైన్ పనులు 88 శాతం పూర్తి
ఇప్పటికే రైల్వే చేపట్టిన మూడో లైన్ పనులు 88 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 12 శాతం పనులు పూర్తికాగానే, నాలుగో రైలు మార్గం పనులను చేపట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఈ కీలక మార్గంలో రైలు రవాణాను మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా ఈ రైల్వే లైన్లను అభివృద్ధి చేస్తోంది.

కాజీపేట బల్లార్ష నాలుగో లైన్ కు లొకేషన్ సర్వే పూర్తి
కాజీపేట-బల్లార్ష మధ్య నాలుగో రైల్వే లైన్‌కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) ఇటీవల పూర్తయింది. ఈ లైన్‌ను మంజూరు చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తరాది రాష్ట్రాలను దక్షిణాదితో అనుసంధానించే గ్రాండ్ ట్రంక్ రూట్‌లో కాజీపేట-బల్లార్ష మార్గం నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. ప్రయాణికులను చేరవేసే రైళ్ళు, గూడ్స్ రాకపోకలతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది.
కీలక రైలు రవాణా మార్గాలలో ఇది ఒకటి
మూడో, నాలుగో లైన్లు పూర్తయితే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక ట్రాక్ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల సికింద్రాబాద్ నుండి ఢిల్లీ, చండీగఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, పట్నా, లఖ్‌నవూ, అలహాబాద్ వంటి నగరాలకు రైలు ప్రయాణం వేగవంతమవుతుంది. ఈ మార్గంలో 3వ లైను అందుబాటులోకి వస్తే సిమెంటు బొగ్గు రవాణా తో పాటు ఇతర పారిశ్రామిక అవసరాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దేశంలోని కీలక రైలు రవాణా మార్గాలలో ఒకటిగా నిలుస్తుంది
మూడో లైన్ ప్రాజెక్టు 205 కిలోమీటర్ల పొడవు
రాష్ట్ర పర్యటనలో శంకర్‌పల్లి-కాజీపేట వరకు విండో ఇన్స్పెక్షన్ చేసిన మంత్రిని కొద్దిరోజుల క్రితం కలిసిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. మూడో లైన్ ప్రాజెక్టు 205 కిలోమీటర్ల పొడవు కాజీపేట-బల్లార్ష మధ్య 177 కిలోమీటర్ల కనెక్షన్ తో , 2,063 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో 88 శాతం పనులు పూర్తయ్యాయి. గతంలోనే రాఘవాపురం-మందమర్రి మధ్య మూడో లైన్ నిర్మాణం పూర్తయింది.
మిగిలిఉన్న పనులు ఈ మార్గంలోనే
తెలంగాణలో మొత్తం 159 కిలోమీటర్ల మూడో లైన్ మార్గంలో 131 కిలోమీటర్ల పనులు ఇప్పటికే పూర్తికాగా, రేచినిరోడ్-బెల్లంపల్లి-మందమర్రి, ఆసిఫాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య మిగిలిన 28 కిలోమీటర్ల పనులు వేగంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని 46 కిలోమీటర్ల మార్గంలో పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
నాలుగో లైన్ కు తుది సర్వే పూర్తి
ఇదిలా ఉంటే నాలుగో లైన్‌కు సంబంధించి కాజీపేట-బల్లార్ష మధ్య మొత్తం 234 కిలోమీటర్ల మార్గానికి మూడు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు రూపొందించనున్నారు. ఈ నాలుగో మార్గంలో సుమారు 80 శాతం తెలంగాణలో ఉండగా, మిగిలిన భాగం మహారాష్ట్రలో ఉంది. తుది సర్వే తర్వాత, అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను సిద్ధం చేస్తున్నారు. ఆగస్టులో ఈ నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించే అవకాశం ఉందని తెలుస్తుంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications