22-ఏ భూముల విషయంలో మరో శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్!

22-ఏ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల అర్హులైన భూయజమానులకు తీపి కబురు అందింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

నాలా రుసుము చెల్లించిన అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేశారు. అర్హత ఉన్న దరఖాస్తులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22-ఎ సమస్యలపై ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం వేగం పుంజుకుంది. ఇప్పటికే ఇందులో ఐదు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయటంతో పాటు, జీఓ 118, జీఓ 76లకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించారు.

Good news on 22-A lands Issues - key orders on patta lands to residential use without Nala permission

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు ఉన్న 22-ఎ ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి లభించింది. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సి దరఖాస్తుల పరిష్కారానికి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా నాలా ప్రక్రియ పూర్తి కాని పట్టా భూముల సమస్యకు కూడా పరిష్కారం లభించింది. నాలా రుసుము చెల్లించి అర్హత నిర్ధారణ అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.

దీనివల్ల చాలా మంది భూయజమానులు ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం అధికారుల కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. 22-ఎ సమస్యల పరిష్కారంపై నిరంతరం మానిటరింగ్ చేయాలని కూడా చెప్పారు.

 తెలంగాణా ప్రజలకు ఢిల్లీకి వారధి బ్లూ బుల్లెట్ .. తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ 50ఏళ్ళ ప్రస్థానం
తెలంగాణా ప్రజలకు ఢిల్లీకి వారధి బ్లూ బుల్లెట్ .. తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ 50ఏళ్ళ ప్రస్థానం

ఈ తాజా ఉత్తర్వులతో 22-ఎ భూముల విషయంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం వైపు మరో అడుగు ముందుకు పడినట్టు అయ్యింది. అర్హులైన భూయజమానులు నాలా రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ఇది నిజంగా నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు తీపి కబురుగా చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+