త్వరలో సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్ చేసిన వైద్యారోగ్య శాఖా మంత్రి

సనత్‌నగర్‌ టిమ్స్ ఆసుపత్రిపై మంత్రి దామోదర రాజనర్సింహ శుభవార్త చెప్పారు. త్వరలోనే సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం అవుతుందని తీపికబురు చెప్పారు. తాజాగా వైద్య సేవల ట్రయల్ రన్‌పై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమగ్ర సమీక్ష నిర్వహించారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల ఏర్పాటు తదితర అంశాలపై వివరంగా చర్చించారు.

గత ప్రభుత్వ హయాంలో మొదలైన టిమ్స్ పనులు

తాజాగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రోడ్లు-భవనాల శాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో 2023 ఫిబ్రవరి 8న నిర్మాణ పనులు ప్రారంభమైనా, 2023 డిసెంబర్ 7 నాటికి కేవలం 13.14 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

Good news on sanathnagar TIMS Health Minister said to ready tims for inauguration on june 2nd

కాంగ్రెస్ ప్రభుత్వంలో వేగంగా టిమ్స్ పనులు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా టిమ్స్ నిర్మాణ పనులను సమీక్షించి, వేగంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత రెండున్నర సంవత్సరాల్లో భవన నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోలు, ఇతరత్రా పనులు వేగంగా పూర్తి చేశారు. ప్రస్తుతం కొన్ని చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, మరో 15 రోజుల్లోగా వాటిని కూడా పూర్తి చేసి హాస్పిటల్‌ను సిద్ధం చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు.

టిమ్స్ పనులపై మంత్రి కీలక ఆదేశాలు

మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, నిర్మాణ వ్యయం అడ్డగోలుగా పెరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాస్త్రీయంగా అంచనాలు వేయించి ప్రజాధనాన్ని కాపాడారని గుర్తు చేశారు.టిమ్స్ ఆసుపత్రిలో ఎటువంటి లోపాలు ఉన్నా తక్షణం సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు, డాక్టర్లు-సిబ్బంది సంసిద్ధత, రోగులకు అందించే సేవల నాణ్యతపై వివరంగా సమీక్షించారు.

మోదీ చెప్పిన పనిలో సీఎం రేవంత్ రెడ్డి!
మోదీ చెప్పిన పనిలో సీఎం రేవంత్ రెడ్డి!

అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన ప్రముఖ ఆసుపత్రి

ప్రారంభోత్సవానికి ముందే అన్ని పనులు పూర్తి చేసి, ప్రజలకు పూర్తి స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సనత్‌నగర్ టిమ్స్‌ను అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన ప్రముఖ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి తరహాలో ఈ ఆసుపత్రి కూడా హైదరాబాద్‌లోని ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+