గాల్లో తేలిపోయే వార్త.. మామునూరు ఎయిర్ పోర్ట్ కు కీలక అడుగు!

ఓరుగల్లు వాసుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించబోతుంది. ఓరుగల్లు వాసుల గగనయాన స్వప్నం త్వరలో సాకారం కాబోతుంది. ఓరుగల్లులోని మామునూరు ఎయిర్ పోర్ట్ కు వేగంగా అడుగులు పడుతున్నాయి. వరంగల్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ ఈ మేరకు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.

మామునూరు ఎయిర్ పోర్టు స్థల పరిశీలన చేసిన మంత్రి
ఈ క్రమంలో నేడు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మామునూరు ఎయిర్పోర్టు ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ నిమిత్తం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా గాడిపల్లి గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామస్తులతో మంత్రి సమావేశమై విమానాశ్రయ ఏర్పాటుకు కావలసిన 253 ఎకరాల భూసేకరణ నిమిత్తం రైతులతో మాట్లాడారు.

Good news on Warangal Maamunoor Airport key step for land aquisition

ఎయిర్ పోర్ట్ భూ సేకరణ కోసం రైతులతో మాట్లాడిన మంత్రి
ఎయిర్ పోర్ట్ వస్తే స్థానిక ప్రజల జీవితాలు ఎలా మెరుగుపడతాయో చెప్పి, వారిని ఒప్పించారు మంత్రి కొండా సురేఖ. ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు తమ విలువైన భూములు ఇస్తున్న రైతులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. భూమి కోల్పోతున్న 233 మంది రైతులు, ప్లాట్ ల యజమానులతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు ఇతర భూమి కేటాయిస్తామన్నారు.

వరంగల్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయం
వారు కోరిన విధంగా మౌలిక సదుపాయలైన రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర సదుపాయాలను కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలంగాణా ప్రభుత్వం ఉందని తెలిపారు. వరంగల్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వరంగల్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు.

అంతర్జాతీయ విమానాశ్రయంగా మామునూరు ఎయిర్పోర్ట్
వరంగల్ భవిష్యత్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మామునూరు ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రయాణికుల సర్వీసులతోపాటు, కార్గో సర్వీసులు అందించే దిశగా ఎయిర్ పోర్టు అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి 150 కి.మీల దూరంలో మరో వాణిజ్య విమానాశ్రయం ఏర్పాటు నిబంధనల మేరకు కుదరదని చెప్పినా, సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని, జిఎంఆర్ సంస్థను ఒప్పించి మామునూరు ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారని మంత్రి సురేఖ కొనియాడారు. త్వరలోనే మామునూరు ఎయిర్పోర్ట్ పనులు మొదలు పెడతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+