Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణాలో జెట్ స్పీడులో ఎయిర్ పోర్టుల పనులు!

తెలంగాణలో విమానాశ్రయాల విషయంలో తెలంగాణా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా విమానయాన రంగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో చేపట్టిన విమానాశ్రయాల ప్రాజెక్టుల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మొత్తం రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను ఏర్పాటు చేయటానికి రంగం సిద్ధం అయింది. రాష్ట్ర రవాణా, రోడ్లు-భవనాల శాఖ ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడెం ప్రాంతాల్లో భూసేకరణను వేగవంతం చేసింది.ఇక వరంగల్ లో భూసేకరణ ఇప్పటికే పూర్తయింది.

మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులలో దూకుడు
వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులలో దూకుడు కనిపిస్తుంది. మార్చి నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఉన్న 696.14 ఎకరాలకు అదనంగా 253ఎకరాల భూసేకరణ పూర్తికాగా, ప్రభుత్వం భూసేకరణ, పునరావాసాలకు గతంలో రూ.295కోట్లు, తాజాగా మరో రూ.90కోట్లు విడుదల చేసింది.

good news regarding airports in telangana works in progress for telangana airports

మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి పెరిగిన దూకుడు
భూసమస్యలు పరిష్కారమవడంతో, సేకరించిన స్థలాన్ని ప్రభుత్వ అధికారులు భారత విమానాశ్రయాల సంస్థకి త్వరలో అప్పగించనున్నారు. దీంతో మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి దూకుడు పెరిగింది. మరోవైపు, ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు సమన్వయ బాధ్యతల కోసం ప్రత్యేకంగా ఎయిర్‌ఫోర్స్ అధికారిని నియమించారు. దీనికి 700 ఎకరాల భూమి అవసరం కాగా, 362 ఎకరాల AIF స్థలం ఇప్పటికే అందుబాటులో ఉంది.

ఆదిలాబాద్, రామగుండం విమానాశ్రయాల పనులు ఇలా
ఆదిలాబాద్ విమానాశ్రయానికి మిగిలిన భూమి సేకరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో, జిల్లా కలెక్టర్ ఇటీవలే ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఇది ఉత్తర తెలంగాణ ప్రాంత అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని అంచనా వేస్తున్నారు .పెద్దపల్లి జిల్లా రామగుండం సమీపంలోని అంతర్గాం వద్ద ఏవియేషన్ బృందం గత డిసెంబర్‌లో విమానాశ్రయ ఏర్పాటుపై క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేసింది.

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు త్వరలోనే కార్యరూపం
దాని 'ప్రీ-ఫీజిబిలిటీ' నివేదిక ఈ నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వానికి చేరనుంది. కొత్తగూడెంలో ప్రతిపాదిత రెండు ప్రాంతాల్లో సాంకేతిక సవాళ్లు ఎదురు కాగా, కలెక్టర్ ప్రత్యామ్నాయ స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్,మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ లు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా ముందుకు వెళ్ళేలా తెలంగాణా సర్కార్ ప్రయత్నాలు సాగిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+