మద్యం ప్రియులకు ప్రియమైన వార్త!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణా లిక్కర్ పాలసీ విషయంలో కూడా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ వచ్చే సీజన్ కు లిక్కర్ ప్రొడక్షన్ పెంచాలని బెవరేజేస్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే సమ్మర్ సీజన్ లో మద్యం ప్రియులకు మందు కొరత లేకుండా చూడాలని నిర్ణయించింది. ఇక ధరల విషయంలో కూడా ఆచి తూచి అడుగులు వేస్తుంది.

మందుబాబులకు శుభవార్త
ముఖ్యంగా మందుబాబుల నుండి కూడా వారికోసం తీసుకుంటున్న పలు నిర్ణయాలతో శభాష్ అనిపించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా పని చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ఇబ్బంది పెట్టడం లేదు. మద్యం ధరల విషయంలో ప్రజల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాలు తీసుకోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్తనే చెబుతోంది.

good news said by telangana govt to liquor lovers over liquor rates

మద్యం ధరల పెంపు సిఫారసు చేసిన త్రిసభ్య కమిటీ
సహజంగా ఆదాయం పెంచుకోవడానికి ధరల పెంపుపైన ఫోకస్ చేయాల్సిన ప్రభుత్వం మద్యం ధరలను పెంచడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెరిగే అవకాశం లేదని అధికారికవర్గాలు చెబుతున్నాయి. మద్యం ధరలు పెంచాలని బేవరేజస్ కంపెనీల వాళ్ళతో పాటు మద్యం ధరల పెంపు కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడానికి ముందుకు రావడం లేదు.

రెండేళ్లకోసారి ధరల పెంపు... ఈ మేరకు ప్రతిపాదనలు
రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం ధరల పెంపు పైన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. ఇక ఇదే క్రమంలో తాజాగా బీర్ల ధరలను 20 రూపాయలు, ఇతర మద్యం బాటిల్స్ ధరలను 30 నుంచి 40 రూపాయలు వరకు పెంచాలని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

మందుబాబులను సంతోషపెడుతున్న తెలంగాణా ప్రభుత్వం
అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించలేదు. మందు బాబులను సంతోష పెట్టాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయాన్ని పక్కకు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ధరల పెంపుతో మందుబాబులను నిరాశపరిస్తే ప్రభుత్వం పైన వారిలో విముఖత పెరుగుతుందని కాబోలు.. రేవంత్ సర్కార్ ప్రస్తుతానికయితే మద్యం ధరల పెంపు జోలికి పోవట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+