శుభవార్త: దసరా, దీపావళి పండుగల సీజన్ ప్రత్యేక రైళ్ళు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే!

దసరా, దీపావళి పండుగలు త్వరలో రానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం శుభవార్త వెల్లడించింది. దసరా, దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా 48 ప్రత్యేక రైళ్ళు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దసరా, దీపావళి పండుగలు సీజన్ అంటే చాలామంది తమ స్వగ్రామాలకు, విహారయాత్రలకు ప్రయాణాలు చేస్తుంటారు. కాబట్టి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

పండుగల ప్రత్యేక రైళ్ళు ఈ మార్గాలలో
అక్టోబర్ 21 నుంచి నవంబర్ 27 వరకు సోమ, బుధవారాలలో నాందేడ్ నుంచి పన్వెల్ కు 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది . అంతేకాదు అక్టోబర్ 22 నుండి నవంబర్ 28 వరకు మంగళ, గురువారాలలో పన్వెల్ నుంచి నాందేడ్ కు 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలోనూ పండుగ రద్దీ నేపధ్యంలో అనేక ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసింది.

Good News south central railway announced Special trains for Dussehra and Diwali festival season

సికింద్రాబాద్ శ్రీకాకుళం మధ్య రెండు ప్రత్యేక రైళ్ళు
ఇక సికింద్రాబాద్ శ్రీకాకుళం మధ్య కూడా పండుగల సీజన్లో అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్డు సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. అక్టోబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఆరవ తేదీ వరకు ప్రతి బుధవారం నాడు రాత్రి 7గంటల 40నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ లో బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది.

శ్రీకాకుళం రోడ్డు నుంచి సికింద్రాబాద్ ఏసి స్పెషల్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ ఇలా
ఇక శ్రీకాకుళం రోడ్డు నుంచి సికింద్రాబాద్ ఏసి స్పెషల్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ అక్టోబర్ మూడవ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు ప్రతి గురువారం శ్రీకాకుళం రోడ్ లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

కరీంనగర్ - పూణే, కొచువెలి - నిజాముద్దీన్ మార్గాలలో కూడా ప్రత్యేక రైళ్ళు
ఇవి కాక అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతి శుక్రవారం కొచువెలి నుంచి నిజాముద్దీన్ వరకు 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 2 వరకు నిజాముద్దీన్ నుంచి కొచువెలి వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్ళు నడవనున్నాయి. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం పూణే నుండి కరీంనగర్ వరకు నాలుగు ప్రత్యేక రైళ్ళు, అక్టోబర్ 23 నుంచి నవంబర్ 13 వరకు ప్రతి బుధవారం కరీంనగర్ నుంచి పూణే వరకు నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+