ఆపరేషన్ థియేటర్ లో టిక్ టాక్ వీడియో చేసిన గవర్నమెంట్ డాక్టర్.. నెటిజన్ల విమర్శలు

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ పిచ్చి ప్రభుత్వోద్యోగుల విధులను పక్కన పెట్టి సరదా వీడియోలు చేసేలా చేస్తుంది. గతంలో కొందరు ఉద్యోగులు పనులు మానేసి టిక్ టాక్ వీడియోలు చేసి విమర్శలపాలయ్యారు. గతంలో ఓ ప్రైవేటు హాస్పిటల్ లో కూడా ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్ వీడియో తీసి అప్ లోడ్ చేయటం వివాదంగా మారింది.

Recommended Video

    3 Minutes 10 Headlines | #MeToo | Namaste Trump | Anti CAA Row | Oneindia Telugu
    ఆపరేషన్ థియేటర్ లో టిక్ టాక్

    ఆపరేషన్ థియేటర్ లో టిక్ టాక్

    తాజాగా ఇక ఈ వీడియోల పిచ్చితో ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు వైద్యం చేస్తూ టిక్ టాక్ వీడియోలు చెయ్యటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్ వీడియో చెయ్యటం తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.

    పేషెంట్ కు వైద్యం చేస్తూ టిక్ టాక్ వీడియోలు చేసిన డాక్టర్

    పేషెంట్ కు వైద్యం చేస్తూ టిక్ టాక్ వీడియోలు చేసిన డాక్టర్

    డాక్టర్, ఆయన బృందం ఆపరేషన్ చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోలో తమిళ హీరో విజయ్ తెలుగు డైలాగ్స్ వినిపిస్తున్నాయి. ఇక దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక పేషెంట్ ను పక్కన పెట్టి గవర్నమెంట్ డాక్టర్ చేసిన వీడియోలపై ఆ పేషెంట్ కు ఏమన్నా అయితే బాధ్యత ఎవరిది? అని మండిపడుతున్నారు.డాక్టర్ అయి ఉండి అందునా ఓ పేషెంట్ కు ఆపరేషన్ చేస్తూ ఇలా చెయ్యటం దారుణం అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

    తనకు తెలీకుండా ఎవరో చేశారని చెప్తున్న డాక్టర్

    తనకు తెలీకుండా ఎవరో చేశారని చెప్తున్న డాక్టర్

    ఇక టిక్ టాక్ పిచ్చితో డాక్టర్లు పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. అయితే డాక్టర్ మాత్రం తనకు ఈ వీడియోతో ఏ సంబంధం లేదని చెప్తున్నారు.

    దీనిపై స్పందించిన సదరు డాక్టర్ ఎవరో కావాలని ఇలా చేశారని ,తాము టిక్ టాక్ వీడియో చెయ్యనేలేదని చెప్తున్నారు. ఇక ఎవరో తమకు తెలియకుండా ఈ వీడియో తీసి దానికి డైలాగ్స్ కూడా కలిపి టిక్‌టాక్‌లో పెట్టారని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+