గవర్నర్ చురుగ్గా పనిచేస్తున్నారు: దత్తాత్రేయ, భద్రతపై రాజీలేదన్న కెటిఆర్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రత్యేక పరిస్థితులు వస్తేనే గవర్నర్ జోక్యం చేసుకుంటారని అన్నారు.
గవర్నర్ నరసింహన్ చురుగ్గా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ సూచించారు.
మహిళా ఉద్యోగుల భద్రతపై రాజీపడబోం: కేటీఆర్

హైదరాబాద్: మహిళా ఉద్యోగుల భద్రతపై రాజీపడబోమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు స్పష్టం చేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ ఇండస్ట్రీస్, పోలీసుల ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని మైండ్‌సెట్‌లో షీ షెటిల్ బస్సులను మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐటీ కారిడార్‌లో మూడున్నర లక్షల మంది ఉద్యోగులున్నారని తెలిపారు. స్మార్ట్ అండ్ సేఫ్ హైదరాబాద్ కోసం పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పారు. మహిళల భదత్ర కోసం అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications