వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు:కేసీఆర్‌పై గవర్నర్(పిక్చర్స్)

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె చంద్ర‌శేఖ‌ర‌రావుపై తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ నర‌సింహ‌న్ ప్ర‌శంస‌ల వర్షం కురిపించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్య‌మంత్రి కె చంద్ర‌శేఖ‌ర‌రావుపై తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ నర‌సింహ‌న్ ప్ర‌శంస‌ల వర్షం కురిపించారు. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుందనుకుంటే ఎవ‌రినుంచైనా స‌ల‌హాలు స్వీక‌రించే ఇటువంటి ముఖ్య‌మంత్రిని తానెప్పుడూ చూడ‌లేద‌ని వ్యాఖ్యానించారు.

ఏదైనా ఆలోచ‌న వ‌చ్చిందంటే ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా దానిని అమ‌లు చేసే వ‌ర‌కు ఆయ‌న విశ్ర‌మించ‌ర‌ని అన్నారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఆదివారం ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గ‌వ‌ర్న‌ర్‌ను కలిసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుంద‌ని, నెంబ‌ర్ వ‌న్‌గా నిలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఐటీశాఖా మంత్రి కేటీఆర్‌పైనా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని నంబ‌ర్ వ‌న్‌గా నిలిపార‌ని పేర్కొన్నారు.

గవర్నర్ ప్రశంసలు

గవర్నర్ ప్రశంసలు

గత 31 నెలలుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తోందని గవర్నర్ కితాబిచ్చారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌వనగా నిలుస్తుందని, 2017లో తెలంగాణ మరిన్ని విజయాలను సాధిస్తుందని అన్నారు.

మిషన్ భగీరథపై ఇలా..

మిషన్ భగీరథపై ఇలా..

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కారు చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక నీటి తొట్టిలాంటిందని గవర్నర్‌ అన్నారు. ఇప్పటికే ఈ పథకానికి చాలా అభినందనలు, ప్రశంసలు వచ్చాయన్నారు. భగీరథ పథకం ఈ ఏడాది ఆఖరుకు పూర్తవుతుందని.. మిషన్ కాకతీయ పథకంలో రెండు దశలు పూర్తయ్యాయన్నారు. వీటితో పాటు ఇతర నీటి పారుదల పథకాలు, కార్యక్రమాలు త్వరలోనే ఫలాలు అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సాగునీటికి కొదవలేదు

సాగునీటికి కొదవలేదు

సాగునీటి రంగానికి చాలినంత నీరు రాష్ట్రంలో ఉందన్నారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం నెలకొంటుందని, రాష్ట్రంలో విద్యుత సంక్షోభం ఏర్పడుతుందని, ఉత్పత్తి, సరఫరా తగ్గుతాయన్న భయాందోళనలు ఉండేవన్నారు. కానీ, ఈ అపనమ్మకాలను కేసీఆర్‌ తిప్పికొట్టారని కొనియాడారు. విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది, తమసోమా జ్యోతిర్గమయ (చీకటి నుంచి వెలుగులోకి ప్రస్థానం) అన్నట్లుగా కొత్త నిర్వచనం ఇచ్చారన్నారు.

శాంతి భద్రతలపై

శాంతి భద్రతలపై

రాష్ట్రంలోని శాంతి భద్రతలపై గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు కూడా పూర్తి నిబద్ధత, అంకితభావంతో పని చేస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారని కొనియాడారు. హైదరాబాద్‌లో ఉత్కంఠ పరిస్థితులకు స్వస్తి చెప్పేలా శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలనూ గవర్నర్‌ ప్రశంసించారు.

పారిశ్రామిక అనుకూల విధానాలు

పారిశ్రామిక అనుకూల విధానాలు

ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలు.. పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్శించాయన్నారు. ఈ పెట్టుబడులే నిరుద్యోగ యువత కోసం పెద్ద మొత్తంలో ఉద్యోగాలను సృష్టిస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు ప్రభుత్వం టీమ్‌ స్ఫిరిట్‌తో పని చేస్తోందని కితాబిచ్చారు. కేసీఆర్‌ బృందం అత్యంత నిబద్ధత, అంకితభావంతో ఒక కుటుంబంలా కలిసి పని చేస్తోందని కితాబిచ్చారు.

అవినీతిని నిర్మూలంచాలి

అవినీతిని నిర్మూలంచాలి

రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో అవినీతిని నిర్మూలించాలని గవర్నర్‌ సలహా ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ దిశగా పని చేస్తుందన్నారు. అవినీతి అంతమైతేనే ప్రజలకు ఫలాలు అందుతాయన్నారు. ప్రభుత్వంలో పని చేస్తున్నవారందరూ అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాలని, ఈ విషయంలో రాజీ పడకూడదని ఉద్బోధించారు. ప్రస్తుతం అధికారులు చేపడుతున్న మంచి పనులు దశాబ్దాలపాటు నిలిచిపోతాయని, ఆ పనులే భవిష్యత్తుకు గట్టి పునాదులవుతాయన్నారు. కలలను సాకారం చేసుకోవడంలో సీఎం కేసీఆర్‌కు అందరూ సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు గవర్నర్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు.

కేటీఆర్‌పైనా ప్రశంసలు

కేటీఆర్‌పైనా ప్రశంసలు

సీఎం కేసీఆర్ తోపాటు ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పైనా గవర్నర్‌ అభినందనల వర్షం కురిపించారు. ఇన్ఫర్మేషన టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ఆయన నంబర్‌వనగా నిలిపారని కితాబిచ్చారు. టీ-హబ్‌ అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప అన్వేషణ అని కొనియాడారు.

English summary
Governor narasimhan on Sunday praised telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X