గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వడపోత.!కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత అభ్యర్థుల ఖరారు.!మోత్కుపల్లికి ఛాన్స్.?
హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి ముహూర్తం సమీపిస్తోంది. ఆశావహుల్లో ఉత్కంఠ కూడా రెట్టింపవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పాడి కౌషిక్ రెడ్డిని సిఫార్సు చేసిన క్రమంలో ఆ ఫైల్‌ను గవర్నర్ తమిళ సై మూడు నెలల పాటు పెండింగ్‌లో పెట్టారు. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గులాబీ బాస్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
గత పరిణామాలతో ఆచితూచి : బీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు చాలా మంది ఆశావహుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా కొందరి పేర్లు వడపోతలో భాగంగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. విద్యా వేత్తలకు ఇస్తే అందులో టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు ఎప్పటినుంచో పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్న పీఎల్ శ్రీనివాస్‌తో సహా మరో ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ కోటలో దాసోజు శ్రవణ్, బూడిద బిక్షమయ్య గౌడ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోం ది.


ఆమోదమైన అభ్యర్ధుల ఎంపిక కోసం కసరత్తు : ఇక ఈ నెల మే 27న శాసన మండలిలో గవర్నర్ కోటాలో రెండు ఎమ్మె ల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. క్రిస్టియన్ మైనార్టీ నుంచి డి. రాజేశ్వర్ రావు, ముస్లిం మైనార్టీ నుంచి ఫారూఖ్ హుస్సేన్ ఉన్నారు. వీళ్లు ఇద్దరు కూడా మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వారే. మూడు సార్లు ఎమ్మెల్సీగా పని చేశారు. ఇందులో ఒకరికి మరో అవకాశం ఇస్తారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. మరోవైపు ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆమోదయోగ్యమైన అభ్యర్థిలను ఖరారు చేసే దిశగా సీఎం చంద్రశేఖర్ రావు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications