Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ సర్కారుపై గవర్నర్ తమిళిసై మరోసారి కీలక వ్యాఖ్యలు: కేంద్రానికి రిపోర్ట్

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

పుదుచ్చేరి: తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపర్చిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పుదుచ్చేరిలో గవర్నర్ మీడియాతో మాట్లాడారు.

హైకోర్టుకు వెళ్లడంతోనే రిపబ్లిక్ డే వేడుకలు: తమిళిసై

హైకోర్టుకు వెళ్లడంతోనే రిపబ్లిక్ డే వేడుకలు: తమిళిసై

ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని యత్నించారు. ఓ శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్లడంతో మళ్లీ వేడుకలకు అవకాశం వచ్చింది. గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశాను. దాన్ని పక్కన పెట్టి రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలని రెండు రోజుల క్రితమే సమాచారమిచ్చారని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఆ లేఖలో కూడా సీఎం హాజరవుతారని పేర్కొనలేదన్నారు.

తెలంగాణ సర్కారుపై కేంద్రానికి రిపోర్టు ఇచ్చానంటూ తమిళిసై

తెలంగాణ సర్కారుపై కేంద్రానికి రిపోర్టు ఇచ్చానంటూ తమిళిసై

కేంద్ర ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. కనీసం ప్రసంగ పాఠాన్ని కూడా ప్రభుత్వం పంపలేదని గవర్నర్ తమిళిసై తెలిపారు. గణతంత్ర వేడుకల సందర్బంగా కొందరిని సన్మానించినట్లు చెప్పారు. గణతంత్ర వేడుకలు ప్రజల మధ్య జరుపుకోవడం ఆనందాన్నిచ్చిందని గవర్నర్ తమిళిసై తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై కేంద్రానికి ఇవ్వాల్సిన రిపోర్టు ఇచ్చానని గవర్నర్ తమిళిసై తెలిపారు. రిపబ్లిక్ వేడుకలు జరపడం ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహించకపోవడానికి చెప్పిన సాకు నవ్వు తెప్పించిందన్నారు. ప్రభుత్వ వైఖరిపై కేంద్రానికి ఇవ్వాల్సిన రిపోర్టు ఇచ్చానని గవర్నర్ స్పష్టం చేశారు.

5 లక్షల మందితో సభ నిర్వహిస్తే కరోనా రాదా?: గవర్నర్ నిలదీత

5 లక్షల మందితో సభ నిర్వహిస్తే కరోనా రాదా?: గవర్నర్ నిలదీత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆదేశాలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి నివేదిక ఇచ్చా. 5 లక్షల మందితో ఖమ్మంలో సభ నిర్వహిస్తే గుర్తుకు రాని కరోనా నిబంధనలు.. రిపబ్లిక్ వేడుకలకు గుర్తుకు వచ్చాయా? అని గవర్నర్ తమిళిసై నిలదీశారు. అంతకుముందు గణంత్ర వేడుకల సందర్భంగా కూడా రాష్ట్ర సర్కారు తీరుపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త భవనాలు కట్టడం కాదు.. పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం తనవంతుగా ప్రభుత్వానికి సహకరిస్తున్నట్లు గవర్నర్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+