ప్రీతిని పరామర్శించిన గవర్నర్ తమిళిసై: సైఫ్ అరెస్ట్, వేధింపులపై ఆధారాలు లభ్యం
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సాయంత్రం పరామర్శించారు.
హైదరాబాద్: నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సాయంత్రం పరామర్శించారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రీతి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందని తెలిపారు.

ప్రీతిని పరామర్శించిన గవర్నర్ తమిళిసై: ఏమన్నారంటే..?
వైద్యానికి సహకరించి ప్రీతి త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ కేసులో చాలా పరిణామాలు జరిగాయని.., ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. స్టూడెంట్స్ అందరూ ధైర్యంగా ఉండాలన్నారు. వైద్యులు ప్రీతికి అన్ని రకాల ట్రీట్‌మెంట్లు అందిస్తున్నారని తెలిపారు.
ఈ కేసులో విచారణ పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరగాలని గవర్నర్ తమిళిసై పోలీసులను కోరారు. ప్రీతి చాలా క్లెవర్ స్టూడెంట్ అని విన్నాను.. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో ఈ కేసులో దర్యాప్తు జరగాలన్నారు.

ప్రీతిని వేధించిన నిందితుడు సైఫ్ అరెస్ట్, ఆధారాలు లభ్యం
మరోవైపు, ప్రీతిని వేధింపులకు గురిచేసిన ఆమె సీనియర్ విద్యార్థి, నిందితుడు సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు ఏం జరిగిందన్న దానిపై సైఫ్ ను విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సైఫ్.. ప్రీతిని వేధించినట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ప్రీతిని అవమానించే విధంగా సైఫ్.. వాట్సాప్ సందేశాలు పంపాడని గుర్తించారు. సైఫ్ పై ర్యాగింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్య అంటూ తండ్రి ఆవేదన
కాగా, సైఫ్ వేధించడం వల్లే తన కూతురు ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందని మొదట్నుంచి ఆమె తండ్రి చెబుతున్నారు. ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపాల్ తోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా ఫలితం లేకపోవడంతో తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసిందని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రీతి సోదరుడు కూడా సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందన్నాడు. వైద్యులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించాడు.

ప్రీతి ఆరోగ్యం విషమంగానే: నిమ్స్ వైద్యులు
ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు.ప్రీతి నిమ్స్‌లో జాయిన్ అయ్యేటప్పటికే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉందని వైద్యులు చెప్పారు. ప్రీతిని వెంటిలేటరీ అయానోట్రోపిక్ సపోర్టుతోనే నిమ్స్‌కు తరలించారని అన్నారు. ప్రస్తుతం కార్డియాక్, శ్వాస కోశ సమస్యలు ఉన్నాయని చెప్పారు. స్పెషలిస్ట్ వైద్యుల సహాయంతో ఎక్మో చికిత్స అందిస్తున్నామని నిమ్స్ డాక్టర్లు తెలిపారు. మరోవైపు ప్రీతిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉష పరామర్శించారు.
సైఫ్ వేధింపుల కారణంగా బుధవారం హానికరమైన ఇంజెక్షన్ తీసుకోవడంతో ప్రీతి కోమాలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కాగా, నిందితులను శిక్షించాలంటూ పలు పార్టీలకు చెందిన నేతలు నిమస్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతికి న్యాయం జరిగే వరకూ ఆందోళన చేస్తామన్నారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications