రేవంత్ అనూహ్య నిర్ణయం - కీలక మలుపు..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం పైన పోరాటాని కి మాజీ సీఎం కేసీఆర్ సమాయత్తం అవుతున్నారు. పార్టీ నేతలకు ఈ మేరకు దిశా నిర్దేశం చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన తరువాత రాజకీయంగా తన రూటు మార్చుతున్నారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పైనా కసరత్తు కొనసాగుతోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
రేవంత్ కొత్త వ్యూహం
ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన తరువాత వ్యూహం మార్చారు. ఈ నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అంతకు ముందే ప్రత్యేక అసెంబ్లీ భేటీకి రేవంత్ నిర్ణయించారు. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిన ట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల్లో వీటి పైన చర్చ నిర్వహించి బిల్లులకు చట్టబద్ధత కల్పించ ను న్నారు. కాగా, మార్చి 10 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఢిల్లీ కి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ బీసీ రిజర్వేషన్లకు మద్దతివ్వాలని కేంద్రాన్ని కోరనున్నారు.

ప్రత్యేక సమావేశం
కేంద్రం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా రేవంత్ పోరాటానికి దిగాలని భావిస్తున్నట్లు తెలు స్తోంది. అదే విధంగా ఈ అంశం పైన అవసరమైతే అఖిలపక్ష నేతల్ని ఢిల్లీ తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అన్ని పార్టీలకు త్వరలో సీఎం లేఖలు రాసేందుకు సిద్దమ య్యారని చెబుతున్నారు. ఇక, మార్చి 10వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నా యి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లుతో పాటుగా విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించనుంది. రిజర్వేషన్ల విషయం లో కేంద్రంతో పోరాటం చేయటానికి వెనుకడేది లేదని రేవంత్ టీం చెబుతోంది.
ఢిల్లీతో పోరాటం
అయితే బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చేసే చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదిస్తే సరిపోదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పెంచిన రిజర్వేషన్లు అమలు కావాలంటే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. లేదా పార్లమెంటులో ఈ చట్టాన్ని ఆమోదింపజేసి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. ఈ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం చేయాలని రేవంత్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో మిగిలిన రాజకీయ పార్టీలను కూడా ఢిల్లీకి రావాలని కోరనున్నారు. దీంతో.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications