తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు సీఎం తీపికబురు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపికబురు వినిపించారు. పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సమీక్ష సందర్భంగా కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్‌పై రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విషయంలో ఖర్చుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడ వద్దని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్లకు సంబంధించి నాణ్యత విషయంలో పక్కాగా ఉండాలని తేల్చి చెప్పారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే సమయానికి విద్యార్థులకు కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

యూనిఫామ్‌తో పాటు 22 వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు అందించడానికి ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా రూపొందించుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. యూనిఫామ్ తో పాటు స్కూల్ బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించడానికి అవసరమైన ప్రొక్యూర్మెంట్ కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ల విషయంలో పెండింగ్ లో అన్ని రకాల బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు.
బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్ల కాంట్రాక్టర్లు పనుల విషయంలో కొంత నిరుత్సాహానికి గురి అవుతారని, పనుల్లో జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పరిస్థితులు తలెత్తకుండా చూడాలని అన్నారు. బిల్లుల వివరాలను ఎప్పటికప్పుడు అందజేస్తుండాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ పాల్గొన్నారు.
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications