ఇక వారికి రేషన్ సరఫరా బంద్, డెడ్ లైన్ - కీలక ఆదేశాలు..!!

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్. పౌర సరఫరాల శాఖ కీలక హెచ్చరిక చేసింది. రేషన్ తీసుకునే లబ్దిదారులకు ఇప్పటికే ఈ కేవైసీ తప్పని సరి చేస్తూ పభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ అనేక మంది ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయలేదు. దీంతో.. ప్రభుత్వం తాజాగా కీలక హెచ్చరిక చేసింది. ఈ నెలాఖరులోగా లబ్దిదారులు అందరూ తమ ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలని.. లేని వారికి జనవరి నుంచి సన్నబియ్యం సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

తెలంగాణ పౌరసరఫరాల శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రేషన్‌కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డులకు నూతన సంవత్సరం నుంచి సన్నబియ్యం కోటా నిలిపివేయనున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరుగుతోంది. రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యులు అంతా సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. రెండు సంవత్సరాలుగా ఈ-కేవైసీ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకోని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు గడువు మాత్రమే ఉండటంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది.

Govt suggests ration card holders to complete EKYC before end of this month

గడువులోపు ఈ-కేవైసీ చేయించుకోని వారికి రేషన్ బియ్యం పంపిణీ ఉండదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, షాపుల ముందు సమాచారం తెలియజేసే ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్రంలో 1.01 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరింది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11.27 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది.

వీటి ద్వారా 34 లక్షల మంది కొత్త లబ్ధిదారులు వ్యవస్థలోకి వచ్చారు. గత ప్రభుత్వ కాలంలో మంజూరైన కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ దాదాపు 80 శాతం పూర్తయింది. అయితే కొత్త రేషన్ కార్డుల్లో కేవలం 40 శాతం మాత్రమే ఈ-కేవైసీ పూర్తైంది. ఇంకా 60 శాతం మంది లబ్ధిదారులు వేలిముద్రలు వేయాల్సి ఉంది. గడువు తక్కువగా ఉండటంతో డీలర్లు, లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ-కేవైసీ గడువును ఫిబ్రవరి వరకు పొడిగించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ-కేవైసీ పూర్తి చేయాలంటే రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ వ్యక్తిగతంగా హాజరై బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+