తెలంగాణలో పెరుగుతున్నకాంగ్రెస్ గ్రాఫ్.. బీఆర్ఎస్ లో గుబులు!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార బి ఆర్ ఎస్ పార్టీలో ఆందోళన రోజురోజుకు పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా వస్తున్న సర్వేలలో మెజార్టీ సర్వేలు కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీగా పుంజుకుందని, కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసే అవకాశాలను వెల్లడించాయి. ఈసారి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని స్పష్టం చేశాయి.
అందుకు తగ్గట్టే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు వెళుతుంది. కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ ను అనూహ్యంగా పెంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇటీవల ఇండియా టీవీ సి ఓటర్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విజయకేతనం ఎగర వేస్తుంది అని చెప్పడంతో ఆందోళనలో ఉన్న బి ఆర్ ఎస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. సీఎం కేసీఆర్ క్రైసిస్ మేనేజ్మెంట్ కు ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా సమాచారం.

ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ నే అని సర్వే సంస్థల ద్వారా వెల్లడించడానికి కేటీఆర్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే కొన్ని క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ప్రచారాన్ని తాము చేయలేమని, అలా చేస్తే తమ సంస్థకు క్రెడిబిలిటీ దెబ్బతింటుందని చెప్పినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అన్న వేవ్ వస్తున్న నేపథ్యంలో, అలాంటిదేమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, నేతలు నానా అగచాట్లు పడుతున్నారు. ఇటీవల ఓ సర్వే సంస్థ తెలంగాణ రాష్ట్రంలో గెలిచేది బిఆర్ఎస్ పార్టీనే అని తమ సర్వే రిపోర్ట్ ను ప్రకటించడం కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రచారానికి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి దారుణంగా ప్రస్తుతం వెనకబడి పోగా, కాంగ్రెస్ పార్టీ దూకుడును కొనసాగిస్తుంది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీగా కనిపించటంతో బీఆర్ఎస్, బీజేపీ నుండి అసంతృప్త నేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదని చెప్పడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు.












Click it and Unblock the Notifications